Third Wave : కరోనా ముూడో దెబ్బ! నెలాఖరు నాటికి రోజుకు 8 లక్షల కేసులు రావొచ్చు..!

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.

Third Wave : కరోనా ముూడో దెబ్బ! నెలాఖరు నాటికి రోజుకు 8 లక్షల కేసులు రావొచ్చు..!

Omicron Third Wave India May Hit 8 Lakh Daily Covid Infections By End Of January, Suggests Sutra Model

Omicron Third Wave : భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ మూడో వేవ్ (Omicron Third Wave) అనే పదం భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికా రోజువారీ కేసుల సంఖ్యను భారత్‌ మించేపోయేలా కనిపిస్తోంది. సెకండ్‌వేవ్‌ కంటే భారీ సంఖ్యలో మూడో వేవ్ కేసులను భారత్‌ ఎదుర్కోబోతుందా? అసలు సైంటిస్టులు ఏం చెబుతున్నారు..? కేంబ్రిడ్జ్‌ వర్శిటీ పరిశోధకుల నుంచి మన కేంద్ర ప్రభుత్వ పరిశోధనా బృందం అందరిది ఒక్కటే అంచనా..! అదే నిజమైతే.. భారత్‌లో కరోనా ఉప్పెనలా విరుచుకుపడక తప్పదు..! రోజువారీ కేసుల రికార్డులో అమెరికాకు మించిన కేసులు భారత్‌లో నమోదవుతున్నాయట..

కరోనా సెకండ్‌వేవ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు రోజుకు 4లక్షల కన్నా ఎక్కవ కేసులు రికార్డయ్యాయి. మూడో వేవ్‌లో అంతకుముంచి కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటోంది సూత్రా మోడల్ (SUTRA model) నమోనా.. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు 4 లక్షల నుంచి 8 లక్షల పాజిటివ్ కేసుల మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఈ మోడల్ సూచిస్తోంది. IIT-కాన్పూర్ హైదరాబాద్, జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి మొదటి రోజులలో మూడో వేవ్ కేసులు 8 లక్షల గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. కొన్ని వారాల క్రితం Omicron వేరియంట్ కారణంగా దేశం మొత్తంగా 1.5 లక్షల నుంచి 1.8 లక్షల కరోనా కేసులకు చేరుకుంటుందని సూత్ర మోడల్ అంచనా వేసింది. ముంబైలోని పరిస్థితులను బట్టిని పరిశీలిస్తే.. Omicron వేరియంట్ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. దేశంలో మూడవ కోవిడ్ వేవ్ ప్రభావంతో రోజువారీ కొవిడ్ కేసులు 4 లక్షల నుంచి 8 లక్షల గరిష్ట స్థాయి వరకు నమోదయ్యే అవకాశం ఉందని సూత్ర మోడల్ అంచనా వేస్తోంది.

ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరొచ్చు :
ఈ సూత్ర మోడల్ ఆధారంగా.. ప్రస్తుత దశను అంచనా వేయలేని పరిస్థితి. ముంబై నుంచి ఎక్స్‌ట్రాపోలేటింగ్, జనవరి-చివరి/ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. అంటే.. దీని విలువ రోజుకు 4-8 లక్షల కేసుల మధ్య ఉండవచ్చు.. ఇది 7 రోజుల సగటుకు సమానమని ఐఐటి-కాన్పూర్ సూత్ర కన్సార్టియంలోని డాక్టర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల ఉన్నప్పటికీ, ముంబై, ఢిల్లీలోని ఒమిక్రాన్ కేసులలో దాదాపు 3.5 శాతం ఆస్పత్రిలో చేరినట్లు ఐఐటి పరిశోధకులు తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మూడవ వేవ్ అంచనాలు.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంపై ఆధారపడి ఉన్నాయని ప్రారంభ సూత్ర నమూనా తెలిపింది.

భారత్‌లో కరోనా పరిస్థితులు.. దక్షిణాఫ్రికా కన్నా చాలా భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో ఆస్ప్రతుల్లో పడకల అవసరాలు దాదాపు 1.5 లక్షలకు చేరుకోవచ్చని సూత్ర మోడల్ సూచిస్తోంది. దక్షిణాఫ్రికా డేటా ఆధారంగా పరిశీలిస్తే.. ప్రముఖ పరిశోధకులు, డాక్టర్ మనీంద్ర అగర్వాల్ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. మొత్తంమీద, మూడవ వేవ్ ప్రభావం కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ఒమిక్రాన్ వ్యాప్తితో హాస్పిటలైజేషన్ రేట్లు తక్కువగానే ఉండొచ్చునని, ఈ మూడో వేవ్ హ్యాండిల్ చేసేలా కనిపిస్తోందన్నారు. వాస్తవానికి, రాబోయే రెండు వారాల్లో పరిస్థితులు మారవచ్చునని హెచ్చరించారు. స్థానికంగా ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడే పరిస్థితి ఉండొచ్చునని, జాగ్రత్త ప్రణాళికలు ఎంతైనా అవసరమని పరిశోధకులు సూచించారు.

Read Also : NW China Quake : చైనాలో భారీ భూకంపం.. వరుసగా 3 సార్లు.. తీవ్రత 6.9గా నమోదు..!