Omicron : ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక్రాన్

ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే వీరిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు 93 మంది ఉండటం గమనార్హం

Omicron : ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక్రాన్

Omicron (2)

Omicron : దేశంలో ఒమిక్రాన్ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 1200 దాటాయి. ఈ నెల 27తేదీ వరకు 500 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా.. నలుగురు రోజుల వ్యవధిలోనే కొత్తగా 700 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. 141లో 93 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

Also Read : Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం..?

ఇక ఒమిక్రాన్ నిర్దారణ అయినవారిలో 21 మంది కే వెస్ట్ వార్డుకు చెందిన వారు ఉన్నారు. అంధేరి వెస్ట్, జూహు,వెర్సోవా, డీ వార్డులలో ట్రావెల్ హిస్టరీ లేని ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిని కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇక ప్రస్తుతం వీరందనిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బృహత్ ముంబై నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం వాణిజ్యరాజధాని ముంబైలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 290కి చేరింది.

Also Read : Omicron India : దేశంలో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు