Omicron Variant : వ్యాక్సిన్ తీసుకున్న వారికే.. పార్కులు, మాల్స్, సినిమా హాల్స్ లోకి అనుమతి

రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

Omicron Variant : వ్యాక్సిన్ తీసుకున్న వారికే.. పార్కులు, మాల్స్, సినిమా హాల్స్ లోకి అనుమతి

Omicron Variant

Omicron Variant : కర్నాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కర్నాటక రెవెన్యూ మంత్రి అశోక్ ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఇప్పటికే బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరిని కాంటాక్ట్ అయిన ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే అది ఒమిక్రానా? కాదా? అనేది తేలాల్సి ఉంది.

Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

అలాగే ఫిజికల్ క్లాసులకు అటెండ్ అయ్యే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, ప్రిన్సిపాల్స్, సిబ్బంది కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. స్కూల్ లోకి ఎంటర్ అయ్యే ముందు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలని మంత్రి తేల్చి చెప్పారు.

సినిమా హాళ్లు, మాల్స్, పార్కుల్లోకి రెండు డోసుల టీకా తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామని మంత్రి చెప్పారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో అత్యవసర మీటింగ్ తర్వాత మంత్రి ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. కరోనా కేసులు వెలుగుచూస్తున్న ఈ పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి కల్చరల్ గ్యాథరింగ్స్ లేదా ఈవెంట్స్ పెట్టడానికి అనుమతి లేదని మంత్రి అశోక స్పష్టం చేశారు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

కర్నాటకలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. “సెకండ్ వేవ్‌లో ఎలా చేశామో అదే విధంగా ముందు జాగ్రత్తగా ఆక్సిజన్, ICU బెడ్లను పునఃప్రారంభిస్తాము. ఆక్సిజన్ ప్లాంట్లు పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి మళ్లీ సేవలు అందించబడతాయి. ఆక్సిజన్ లభ్యతపై ఏర్పాటు చేసిన కమిటీ మళ్లీ క్రియాశీలమవుతుంది. ఆక్సిజన్ కంట్రోల్ రూం కూడా పునఃప్రారంభించబడుతుంది. అందుకోసం ఎక్కువ మందిని నియమించుకోవడానికి మేము వారికి అనుమతి ఇచ్చాము” అని మంత్రి అశోక చెప్పారు.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లోనూ ఎంటర్ అయ్యింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు బాధితుల్లో ఒకరు ఇదివరకే భారత్ నుంచి వెళ్లిపోయారు. మరో బాధితుడు 46ఏళ్ల డాక్టర్. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్ లో ముగ్గురికి, సెకండరీ కాంటాక్ట్స్ లో ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటో కాదో తెలుసుకోవడానికి వారి శాంపుల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.

కరోనా కొత్త రకం వేరియంట్ B.1.1.529ను గుర్తించినట్టు నవంబర్ 25న దక్షిణాఫ్రికా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అనే పేరును సూచించింది. ఒమిక్రాన్ దెబ్బకు మరోసారి ప్రపంచం ఆంక్షల్లోకి జారుకుంటోంది. దక్షిణాఫ్రికా సహా ఒమిక్రాన్ కేసులు బయటపడిన దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.