Omicron: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మూడో వేవ్ వచ్చేస్తుందా?

నిన్నమొన్నటివరకు దేశంలో ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్‌గా 9వేల మందికిపైగా కరోనా సోకింది.

Omicron: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మూడో వేవ్ వచ్చేస్తుందా?

India Corona

Omicron: భారత్‌లో కరోనా మరోసారి గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధం అవుతోందా? నిన్నమొన్నటివరకు ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్‌గా 9వేల మందికిపైగా కరోనా సోకింది. ఒక్కరోజే 9 వేల 195 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

దేశంలో కేసులు బాగా తగ్గినట్టుగా అందరూ భావిస్తోన్న సమయంలో ఇన్ని కేసులు నమోదవడం టెన్షన్ పెట్టేస్తోంది. ఒక్క వారం రోజుల్లోనే 70శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24గంటల్లో కరోనాతో 302మంది చనిపోయారు.

మరోవైపు దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒక్కరోజే 64 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఒమిక్రాన్‌ మహారాష్ట్రకు తీసిపోని విధంగా నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజులో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో సగం కంటే ఎక్కువ కేసులు ఢిల్లీలోనే రికార్డయ్యాయి.

ప్రస్తుతం దేశంలో 77,002 యక్టీవ్ కేసులు ఉండగా.. దేశంలో ఇప్పటివరకు 3కోట్ల 48లక్షల 8వేల 886కేసులు నమోదయ్యాయి. అందులో 4లక్షల 80వేల 592 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా నుంచి గడిచిన 24గంటల్లో 7వేల 347 మంది కోలుకున్నారు.