Omicron Variant: జైపూర్‌లో పెళ్లికి హాజరైన 9మంది ఒమిక్రాన్ పేషెంట్లు

జైపూర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన రాజస్థాన్ హెల్త్ అధికారులు సంచలన విషయం తెలుసుకున్నారు. వారంతా నవంబర్ 28న జరిగిన పెళ్లి వేడుకకు హాజరైనట్లు రికార్డులు తెలుపుతున్నాయి.

Omicron Variant: జైపూర్‌లో పెళ్లికి హాజరైన 9మంది ఒమిక్రాన్ పేషెంట్లు

Omicron Variant

Omicron Variant: జైపూర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన రాజస్థాన్ హెల్త్ అధికారులు సంచలన విషయం తెలుసుకున్నారు. వారంతా నవంబర్ 28న జరిగిన పెళ్లి వేడుకకు హాజరైనట్లు రికార్డులు తెలుపుతున్నాయి. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వైభవ్ గల్రియా ఆ తొమ్మిది మందిలో నలుగురు కొద్ది రోజుల క్రితమే దక్షిణాఫ్రికా నుంచి వచ్చారన్నారు.

ఆ నలుగుర్ని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో అడ్మిట్ చేశామని మిగతా ఐదుగురు హోం ఐసోలేషన్ లో ఉన్నారని జైపూర్ సీఎంహెచ్ఓ నరోత్తమ్ శర్మ చెప్పారు. ఒమిక్రాన్ కేసులకు సంబంధించి బిల్డింగ్ లో టాప్ ఫ్లోర్ అయిన ఐదో ఫ్లోర్ ను కేటాయించామంటున్నారు.

‘వారిలో నలుగురు దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 25న వచ్చారు. నవంబర్ 28న జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వారి బంధువుల్లో ఒకరు డిసెంబర్ 1న కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. అందుకే మా టీం డిసెంబర్ 2న వాళ్లింటికి వెళ్లి అందరికీ పరీక్షలు నిర్వహించగా మరో నలుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది’ అని శర్మ అన్నారు.

……………………………………….: భారత్‌లో బూస్టర్ డోస్.. నేడే నిర్ణయం!

పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఎటువంటి లక్షణాలు లేవని కేవలం దగ్గు, జ్వరం మాత్రమే ఉన్నాయని అధికారులు అంటున్నారు. సీటీ స్కాన్, రక్త పరీక్షలు లాంటివి జరుపుతున్నామని వారంతా సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 100మంది వరకూ వచ్చినట్లు చెప్తున్నారు. కేవలం 34మంది శాంపుల్స్ మాత్రమే పరీక్షించగా.. మిగిలిన వారు పరీక్షలు చేయించుకోవాల్సింది.