Omicron Quarantine : ఒమిక్రాన్ భయం.. వారికి 7 రోజుల క్వారంటైన్ మస్ట్.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..

Omicron Quarantine : ఒమిక్రాన్ భయం.. వారికి 7 రోజుల క్వారంటైన్ మస్ట్.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

Omicron Quarantine

Omicron Quarantine : ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ ఆ తర్వాత బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయల్, బ్రిటన్ దేశాలకు పాకింది. బీ.1.1.529 ను ఆందోళనకర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మహమ్మారితో చాలా దేశాలు అప్రమత్తమై.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్‌ కూడా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే వేరియంట్ ను కనుగొనేందుకు వారి శాంపుల్స్ ని మరిన్ని టెస్టులకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో టచ్ లో ఉందని, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతోందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జి చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు.

Omicron : భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.. 8 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు

“ఇప్పటివరకు, పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. కానీ కొత్త వేరియంట్ నివేదికల నేపథ్యంలో, ఆమోదించబడిన COVID ప్రోటోకాల్‌ – శానిటైజర్లు, మాస్క్‌ల వాడకం, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. విదేశాల నుండి వచ్చే వారి నిర్బంధానికి సంబంధించి కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తాం” అని మంత్రి జార్జి అన్నారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువని నిపుణులు హెచ్చరించారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూసిన దేశాలపై ప్రపంచ దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ”అంతర్జాతీయ ప్రయాణీకులపై దృష్టి పెట్టాలి. కరోనా పరీక్షలు పెంచాలి. హాట్ స్పాట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ ను వెంటవెంటనే పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని గైడ్ లైన్స్ లో కేంద్రం సూచించింది.