Sharad Pawar: అమిత్ షా ఏమైనా రామమందిరంలో పూజారా? మందిర నిర్మాణ ప్రకటపై పవార్ సెటైర్

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.

Sharad Pawar: అమిత్ షా ఏమైనా రామమందిరంలో పూజారా? మందిర నిర్మాణ ప్రకటపై పవార్ సెటైర్

On Amit Shah’s Ram Mandir announcement, Sharad Pawar echoes Kharge’s ‘priest’ jibe

Sharad Pawar: రామమందిరాన్ని వచ్చే ఏడాది మొదటి రోజున (జనవరి 1న) ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై శరద్ పవార్ మండిపడ్డారు. రామమందిర నిర్మాణ ప్రకటనలు, ఇతర అంశాలు హోంశాఖ పరిధిలోకి రావని, ఆయినప్పటికీ అమిత్ షా ఈ ప్రకటన ఎలా చేస్తారని ఆయన అన్నారు. రామాలయ పూజారిగా అమిత్ షా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పవార్ ఊటంకించారు. బహుశా రామాలయ పూజారిగా అమిత్ షా చేరి ఉంటారని, అందుకే ఈ ప్రకటన చేశారని పవార్ ఎద్దేవా చేశారు.

Varun Gandhi: బీజేపీకి టాటా.. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వరుణ్ గాంధీ?

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలావరకు రామాలయం పనులు పూర్తయ్యాయి. 2024 జనవరి 1వ తేదీన రామమందిరాన్ని భక్తుల కోసం ఓపెన్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం స్వయంగా ప్రకటించారు.

Himachal Pradesh: ఎన్నికల్లో గెలిచి నెలైనా కాలేదు. అప్పుడే మాట తప్పిన కాంగ్రెస్