Rahul Gandhi : బ్లాక్ ఫంగస్ పై కేంద్రానికి రాహుల్ మూడు ప్రశ్నలు

దేశంలో బ్లాక్ ​ఫంగస్​ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Rahul Gandhi : బ్లాక్ ఫంగస్ పై కేంద్రానికి రాహుల్ మూడు ప్రశ్నలు

On Black Fungus Cases In India Rahul Gandhi Shoots Three Questions At Govt

Rahul Gandhi దేశంలో బ్లాక్ ​ఫంగస్​ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్​ ఫంగస్​ చికిత్సకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. సరైన చికిత్సా విధానం లేక బ్లాక్​ ఫంగస్ బాధితులు సతమతమవుతున్నారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వాడే డ్రగ్స్ కొరతను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఏం చేస్తుందని రాహుల్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్​ వేదికగా కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు రాహుల్ గాంధీ. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

బ్లాక్​ ఫంగస్​ వ్యాధి గురించిన కేంద్రప్రభుత్వం ప్రజలకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. 1. బ్లాక్​ ఫంగస్​ ఔషధం ఆమ్ ​ఫోటెరిసిన్-B కొరతపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? 2. పేషెంట్ ఈ మెడిసిన్ పొందాల్సిన పద్ధతులు ఏంటి?. 3) బ్లాక్​ ఫంగస్​ వ్యాధికి చికిత్స ఇవ్వకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఎందుకు అయోమయంలోకి నెట్టేస్తుంది?అని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు,అమెరికా నుంచి భారత్​ కు ఆదివారం ఉదయం 2 లక్షల బ్లాక్​ ఫంగస్ డ్రగ్స్(ఆమ్​ఫోటెరిసిన్-B) చేరినట్లు అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్ సింగ్​ సంధూ తెలిపారు. అమెరికన్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ గిలీడ్ సైన్సెస్ నుంచి తాజా డ్రగ్స్ వచ్చినట్లు సింగ్​ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆమ్​ఫోటెరిసిన్-B డ్రగ్స్ అమెరికా నుంచి భారత్ కు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.