Bhopal Girl: చిన్నారిపై కుక్కల దాడి.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు

మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లో ఐదు వీధి కుక్కలు మూడేళ్ల బాలికపై దాడి చేసిన ఘటనలో వివరణ

Bhopal Girl: చిన్నారిపై కుక్కల దాడి.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు

Bhopal Girl

Bhopal Girl: మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లో ఐదు వీధి కుక్కలు మూడేళ్ల బాలికపై దాడి చేసిన ఘటనపై ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. వివరణ కోరుతూ భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీచేసింది. అంజలి విహార్ ఫేజ్-2లో చిన్నారిపై కుక్కల దాడి ఘటన సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయింది. దాడిని పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు ఇచ్చింది HRC.

బాలిక తండ్రి కవర్ క్యాంపస్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కూలీగా పనిచేస్తున్నాడు. బాలిక సమీపంలో ఆడుకుంటోంది. ఈ సమయంలోనే వీధికుక్కల గుంపు ఒక్కసారిగా బాలికపై దాడికి దిగాయి. దాడి తర్వాత బాలిక తల, చెవి, చేతిపై లోతైన గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

SpiceJet: ATC అనుమతి లేకుండా విమానాన్ని నడిపిన స్పైస్‌జెట్ పైలట్‌!

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో.. మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో  పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రాబోయే ఏడు రోజుల్లో ఈ సంఘటనపై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ భోపాల్, భోపాల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్య శాఖ అధికారులు సమాధానం చెప్పాలంటూ కమిషన్ ఆదేశించింది.

NIT Warangal: పీహెచ్‌డీ సీట్లు పెంచిన నిట్ వరంగల్