AAP MLA: ఆప్ మహిళా ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త.. వీడియో వైరల్.. మహిళా కమిషన్ ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డాడు ఆమె భర్త. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

AAP MLA: ఆప్ మహిళా ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త.. వీడియో వైరల్.. మహిళా కమిషన్ ఆగ్రహం

AAP MLA: పంజాబ్ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డాడు ఆమె భర్త. తల్వాండి సాబో నియోజకవర్గం నుంచి బల్జిందర్ కౌర్ ఆప్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె భర్త సుఖ్‌రాజ్‌సింగ్ కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు.

Pawan Kalyan: విజయవాడలో వైసీపీ-జనసేన ఘర్షణ.. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త సుఖ్‌రాజ్‌సింగ్ దాడికి పాల్పడ్డ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన వారి స్వస్థలం తల్వాండి సాబోలోనే జరిగింది. ఈ వీడియో ప్రకారం.. ఇక ఇంటి కాంపౌండ్ లోపల బల్జిందర్ కౌర్‌కు, ఆమె భర్తతోపాటు మరికొందరు వ్యక్తులకు మధ్య ఏదో వాగ్వాదం జరిగింది. ఈ దశలో కోపం తెచ్చుకున్న బల్జిందర్ కౌర్‌ భర్త, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా చెంపపై కొట్టాడు. మళ్లీ దాడికి ప్రయత్నిస్తుండగా పక్కనున్న వారు అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన 42 సెకండ్ల నిడివి గల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బల్జిందర్ కౌర్‌ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

BJP: తెలంగాణకు అమిత్ షా.. 17న బీజేపీ భారీ బహిరంగ సభ.. ఏడాదిపాటు విమోచన దినోత్సవాలు

కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో పంజాబ్ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పంజాబ్ మహిళా కమిషన్, దీనిపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డ భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే భర్త సుఖ్‌రాజ్‌సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ కేంద్ర మంత్రి హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ డిమాండ్ చేశారు. సుఖ్‌రాజ్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ డిమాండ్ చేశారు.