MP Anil Firojiya : వావ్, అదీ డెడికేషన్ అంటే.. 32కిలోల బరువు తగ్గి, రూ.2వేల 300 కోట్లు సాధించిన ఎంపీ

ఓ ఎంపీ పట్టుదలతో శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఏకంగా 32 కిలోల బరువు తగ్గాడు. ఫలితంగా రూ.2వేల 300 కోట్ల రూపాయల నిధులు సాధించాడు.

MP Anil Firojiya : వావ్, అదీ డెడికేషన్ అంటే.. 32కిలోల బరువు తగ్గి, రూ.2వేల 300 కోట్లు సాధించిన ఎంపీ

MP Anil Firojiya : కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేని ఏదీ లేదంటారు. ఇది చాలా మంది విషయాల్లో అనేకసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా మరోసారి నిరూపితమైంది. ఓ ఎంపీ పట్టుదలతో శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఏకంగా 32 కిలోల బరువు తగ్గాడు. ఫలితంగా రూ.2వేల 300 కోట్ల రూపాయల నిధులు సాధించాడు.

వివరాల్లోకి వెళితే.. బరువు తగ్గితే నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో ఆ ఎంపీ ఏకంగా 32 కిలోల బరువు తగ్గారు. అధిక బరువును వదిలించుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని, అదే సమయంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఈ ఏడాది జూన్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ హామీ ఇచ్చారు. ఒక్క కిలో బరువు తగ్గితే నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఫిట్ ఇండియా’ పథకం ప్రారంభిస్తూ కేంద్ర మంత్రి ఈ హామీ ఇచ్చారు. దీంతో ఎంపీ ఫిరోజియా కష్టపడి కసరత్తులు చేసి ఇప్పటి వరకు 32 కిలోలు తగ్గారు. గడ్కరీ ఇచ్చిన మాట ప్రకారం తన నియోజకవర్గానికి రూ.2వేల 300 కోట్ల విలువైన ప్రణాళికలకు ఆమోదం పొందానని సంతోషం వ్యక్తం చేశారు.

బరువు ఇలా తగ్గారు..
ఉదయాన్నే 5:30 గంటలకు మేల్కొని మార్నింగ్ వాక్ కు వెళ్లడం, ప్రతిదినం యోగా చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా తన అధిక బరువును వదిలించుకున్నట్లు ఎంపీ ఫిరోజియా చెప్పారు. ఉదయం తేలిక పాటి టిఫిన్, మధ్యాహ్నం సలాడ్, కాయగూరలు, చపాతీలతో భోజనం చేశానని తెలిపారు. ఈ నియమాలతో గతంలో 127 కిలోల బరువున్న తాను ఇప్పుడు 95 కిలోలకు తగ్గానని ఫిరోజియా చెప్పారు. నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయంటే మరింత బరువును కోల్పోవడానికి సిద్ధమని ఫిరోజియా స్పష్టం చేశారు.