PM Modi Birthday..వాక్సినేషన్ రికార్డ్ కోసం బీజేపీ ప్లాన్!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు(సెప్టెంబర్-17) సందర్భంగా దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్​ డోసులను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

PM Modi Birthday..వాక్సినేషన్ రికార్డ్ కోసం బీజేపీ ప్లాన్!

Modi

PM Modi Birthday ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు(సెప్టెంబర్-17) సందర్భంగా దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్​ డోసులను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ కారణాలతో వ్యాక్సిన్లపై ప్రజలలో అనుమానాలు కలిగిస్తున్న వారికి ఈ టీకా పంపిణీ ద్వారా దీటైన జవాబు చెప్పినట్లు అవుతుందని బీజేపీ సీనియర్​ నేతలు చెబుతున్నారు.

ప్రధాని 71వ జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భావిస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​ తెలిపారు. ప్రజలను కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీ పుట్టిన రోజున.. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడం కంటే ప్రత్యేకమైనది ఏముంటుంది. కోవిడ్​ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీకి ఇది మంచి బహుమతి అని తరుణ్​ చుగ్ అన్నారు.

మరోవైపు, మోదీ 71వ పుట్టినరోజు నేపథ్యంలో జైపుర్​ ఫూట్​ యూఎస్​ఏ సంస్థ గుజరాత్​లో మొబైల్​ వ్యాన్​లు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా దివ్యాంగులకు ఉచితంగా ప్రోస్థటిక్​ ఫిట్​మెంట్స్​ను పంపిణీ చేయనుంది.

READ Gujarat Cabinet : కొలువుదీరిన కొత్త మంత్రివర్గం..అందరూ కొత్తవాళ్లే