Rahul Gandhi Bharat jodo yatra: 12వ రోజు కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు .. మత్స్యకారులతో రాహుల్ సమావేశం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజు ప్రారంభమైంది. సోమవారం కేరళ రాష్ట్రంలోని అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్‌లో 'భారత్ జోడో యాత్ర'ను పునఃప్రారంభించారు.

Rahul Gandhi Bharat jodo yatra: 12వ రోజు కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు .. మత్స్యకారులతో రాహుల్ సమావేశం

Rahul Gandhi Bharat jodo yatra

Rahul Gandhi Bharat jodo yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజు ప్రారంభమైంది. సోమవారం కేరళ రాష్ట్రంలోని అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్‌లో ‘భారత్ జోడో యాత్ర’ను పునఃప్రారంభించారు. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ శ్రేణులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా దారిపొడవునా నిలుచున్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు.

ఇదిలాఉంటే పాదయాత్ర కంటే ముందు ఉదయం 6గంటలకు రాహుల్ గాంధీ అలప్పుజాలోని వడకల్ బీచ్‌లో మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఉదయాన్నే జరిగిన ఈ సమావేశంలో పెరుగుతున్నఇంధన ధరలు, తగ్గిన సబ్సిడీలు, పర్యావరణ విధ్వంసం వంటి పలు సమస్యలపై రాహుల్ వారితో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Bharat jodo yatra 12th day schedule

Bharat jodo yatra 12th day schedule

ఉదయం 6.30గంటలకు పున్నప్రా అరవుకడ్‌లో ప్రారంభమైన పాదయాత్ర 16 కిలోమీటర్ల మేరసాగి ఉదయం 11గంటలకు కలవూరుకు చేరుకుంటుంది. అక్కడ రాహుల్ విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో పలు వర్గాలవారితో రాహుల్ సమావేశం అవుతారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు యాత్ర కలవూరు జంక్షన్ వద్ద పునఃప్రారంభం అవుతుంది. తొమ్మిది కిలో మీటర్ల పాదయాత్ర అనంతరం రాత్రి 7గంటలకు చేర్యాల సమీపంలోని మాయితర వద్ద 12వ రోజు పాదయాత్ర పూర్తవుతుంది. రాత్రి అక్కడే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు బస చేస్తారు.