Auto Raja : రుషిగా మారిన నేరస్తుడు..ఇనుప సంకెళ్లతో అనాథల హక్కుల కోసం పోరాటం

ఒకప్పుడు నేరస్తుడు, దోపిడీలు, దొంగతనాలు చేసే కసాయివాడు. ఇప్పుడు అనాథలకు ఆపద్భాంధవుడు, ఆకలితో అల్లాడే నిరుపేదలను ఆపన్నహస్తం అందించే మహనీయుడు బెంగళూరు ఆటో రాజ. అలియాస్ థామస్ రాజా.

Auto Raja : రుషిగా మారిన నేరస్తుడు..ఇనుప సంకెళ్లతో అనాథల హక్కుల కోసం పోరాటం

Auto Raja

Once a criminal auto raja day save destitute : మనిషిలో మార్పు సహజం. మార్పు లేకపోతే మనిషే కాదు. అటువంటి మార్పు ఓ నేరస్తుడిని రుషిగా మార్చింది. మానవత్వం పరిమళించే మనోన్నతుడిని చేసింది. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలతో జైలుజీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు రోడ్డు పక్క తిండి లేక అల్లాడేవారిని చూసి చలించిపోతున్నాడు. నా అనేవారు లేక అనాథలుగా జీవితాలు గడుపుతున్న దుర్భర జీవితాలకు వెలుగునిస్తున్నాడు. వారి కడుపు నింపి అన్నదాతగా మారాడు. నా అనేవారు లేక అల్లాడేవారికి నేనున్నానంటున్నాడు. అతనే ఒకప్పుడు నేరస్తుడిగా ముద్రపడి జైలు జీవితాన్ని గడిపిన బెంగళూరుకి చెందిన ఆటో రాజా అలియాస్ థామస్‌ రాజా. అసలెవరీ థామస్ రాజా?ఏం చేశాడు? ఇప్పుడేం చేస్తున్నాడు?!

ఈ ఆటో రాజా అసలు పేరు థామస్‌ రాజా. ఇతను చిన్నతనంలో దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేస్తుండేవాడు. దీంతో తనపరువు తీస్తున్నాడని తండ్రి తరచు కొడుతుండేవాడు. అయినా థామస్ మారలేదు. దీంతో తండ్రి ఇంటినుంచి గెంటేశాడు. అప్పటికి థామస్ కు 16 ఏళ్ల వయసు. తండ్రి భయం కూడా లేకపోవటంతో తెగిన గాలిపటంలా తిరిగేవాడు థామస్. దొంగతనాలు చేసిన డబ్బులతో చక్కగా తినేవాడు ఎక్కడోచోటు పడుకుని నిద్రపోయేవాడు. అయితే ఈ నేర ప్రవృత్తి కారణంగానే అతను కొన్నాళ్లూ జైల్లో ఉండాల్సి వచ్చింది. అలా నేరాలకు అలవాటు పడ్డాడు. దీంతో పోలీసులు పట్టుకోవటం జైలు పంపించటం. బయటకొచ్చాక మళ్లీ అదే తీరు. ఏమాత్రం మార్పులేదు. కానీ మార్పు అనేది ఎప్పుడోకప్పుడు వస్తుంది. దానికి సమయం రావాలి. ఆ సమయం వచ్చింది థామస్ కు.

Read more :3 Day Work Week: ఆ కంపెనీ ఉద్యోగులకు వారానికి మూడే వర్కింగ్ డేస్..

ఎన్నిసార్లు జైలుకు పంపినా థామస్ లో మార్పు రాకపోవటతో పోలీసులు థామస్ తో కఠిన వ్యవహరించేవారు. నీకు సిగ్గులేదా. ఇదేనా నీ బతుకు ఎన్నాళ్లు ఇలా బతుకుతావ్. అంటూ తిట్టేవారు. దాంతో థామస్ ఆలోచించాడు.నిజమే కదా..ఇలా ఎన్నాళ్లు అనుకునేవాడు. కానీ నాకంటూ ఎవరూ లేరే అనే భావన మొదలైంది. అలా థామస్ లో మార్పు మొదలైంది. అలా వచ్చిన మార్పు థామస్ లో కొత్త జీవితానికి అంకురార్పణ జరిగింది.అలా మనస్సులో వచ్చిన మార్పుతో థామస్ ఇంకెప్పుడు తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవటం గొప్ప కాదు. ఆ నిర్ణయంపై నిలబడటం గొప్ప. అదే చేశాడు థామస్. ఇంకెప్పుడూ ఎవర్నీ మోసం చేయడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఆ తర్వాత ధామస్‌ బెంగళూరు వెళ్లి ఒక ఆటో నడుపుకుంటూ జీవించటం మొదలుపెట్టాడు. అలా కష్టపడిన డబ్బులతో కడుపు నింపుకోవటంలోని ఆనందమేంటో తెలుసుకున్నాడు. గర్వంగా అనిపించింది. ఇన్నాళ్లు నేను బతికింది ఓ బతుకేనా అని అనిపించింది. ఇన్నాళ్ళు ఏదో బతికేశాను. ఇకనుంచి మంచిగా బతకాలి. మనిషిలా బతకాలి అని పదే పదే అనుకునేవాడు. ఈ క్రమంలోనే అతను ఆటో నడుపుకుంటూ వెళ్తున్నప్పుడూ మార్గమధ్యలో చెత్తకుప్పల వద్ద ఉండే నిరుపేదలు, అభ్యాగ్యులు తరచుగా కనిపించేవారు. వారిని చూసి థామస్ చలించిపోయేవాడు. అలా వారికి తినటానికి తిండి పెట్టేవాడు. కానీ తిండి పెట్టి వదిలేచటమే కాదు..13 మందిని చేరదీసి వారి కోసం ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకుని వారికి ఆశ్రయం ఇవ్వటం మొదలుపెట్టాడు. ఒక్కరితో మొదలై 13మందిని చేరదీశాడు.

Read more :‘Givenchy’ Suicide Hoodie Necklace: ‘ఉరితాడు’ డ్రెస్..‘చావమంటారా?’అని తిట్టిపోస్తున్న జనాలు..

అంతేకాదు..న్యూ ఆర్క్‌ మిషన్‌ ఆఫ్‌ ఇండియా అనే ఫౌండేషన్‌ సాయంతో “హోమ్‌ ఆఫ్‌హోప్‌” అనే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దాంట్లో 750 మందికి ఆశ్రయం ఇచ్చాడు, 19 వేల మంది అనాథలను రక్షించాడు. అక్కడితో థామస్ ఆగిపోలేదు. అభాగ్యుల కనీస భోజనం, తాగునీరు లేక ఖైదీల్లా జీవిస్తున్నారంటూ థామస్‌ ఇనుపగొలుసలను ధరించి విన్నూతన రీతిలో అనాథల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు.ఇలా ఇనుప గొలుసులు వేసుకుని థామస్ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు మీడియాను ఆకర్షించాయి. అలా థామస్ అనాథల కోసం చేస్తున్న సేవ..వారి కోసం పడుతున్న తపన పేపర్లలోనూ, టీవిల్లోనూ బాగా వైరల్‌ అయ్యింది. ఒకప్పుడు నేరస్తుడిగా ఉన్న థామస్‌ రాజా ఇప్పుడు నిలువెత్తు మానవత్వానికి నివర్శనంగా కనిపిస్తున్నాడు. థామస్ గురించి తెలిసినవారంతా శభాష్‌” అని అభినందిస్తున్నారు.