Siddaramaiah: అవినీతి సీఎం దిగిపోయారు.. కానీ బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది!

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో రాజీనామా ప్రకటన చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో మాట్లాడుతూ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు.

10TV Telugu News

Siddaramaiah: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో రాజీనామా ప్రకటన చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో మాట్లాడుతూ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపానని వ్యాఖ్యానించారు. తనకెప్పుడూ అగ్ని పరీక్షేనని ఆయన అన్నారు. కాగా, యడియూరప్ప రాజీనామాపై ఇక్కడి ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ సీఎం సిద్దరామయ్య యడియూరప్ప రాజీనామాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా యడియూరప్పను తొలగించినంత మాత్రాన కర్ణాటకకు ఒరిగేదేమి లేదన్న సిద్దరామయ్య.. ఒక అవినీతి ముఖ్యమంత్రి దిగిపోయారు తప్ప రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. యడియూరప్ప స్థానంలో రాబోయే కొత్త సీఎం కూడా మరో అవినీతి పరుడేనని సిద్దరామయ్య విమర్శించారు.

ఇలా అవినీతి ముఖ్యమంత్రులను మార్చినంత మాత్రాన కర్ణాటక ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న సిద్దరామయ్య.. ప్రజల సంక్షేమానికి ఏ మాత్రం కృషిచేయని బీజేపీ సర్కార్ దిగిపోతేనే మంచిదని సిద్దరామయ్య ఆరోపించారు. కాగా.. యడియూరప్ప రాజీనామాపై రాష్ట్ర రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన్ను పీఠం నుండి దిగిపొమ్మనడం వెనుక కారణాలపై ఎక్కడి విశ్లేషకులు రకరకాల చర్చలు నడిపిస్తున్నారు. యడియూరప్ప రాజీనామా వెనుక వయోభారం మాత్రమే అసలైన కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

10TV Telugu News