Coronavirus: ఒకే వ్యక్తి శరీరంలో రెండు కరోనా వేరియంట్లు.. భారత్‌లో ఇదే ఫస్ట్ కేసు

ఒకేసారి ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు సోకింది. ఈ కేసు కొత్తగా భారత్‌లో వెలుగులోకి వచ్చింది. అసోంలోని ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డారు.

Coronavirus: ఒకే వ్యక్తి శరీరంలో రెండు కరోనా వేరియంట్లు.. భారత్‌లో ఇదే ఫస్ట్ కేసు

Coronavirus: ఒకేసారి ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు సోకింది. ఈ కేసు కొత్తగా భారత్‌లో వెలుగులోకి వచ్చింది. అసోంలోని ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డారు. సాధారణంగా వైద్యులు ఎక్కువగా పేషెంట్ల మధ్యే ఉండే అవకాశం ఉండగా.. వారికి ఇటువంటి ప్రమాదం ఉందని నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు.

డాక్టర్ శరీరంలోని నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించామని, ఈ డబుల్‌ ఇన్ఫెక్షన్‌పై స్పష్టత కోసం మరోసారి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపి, ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధరించుకున్నట్లు చెప్పారు. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడగా.. తర్వాత డాక్టర్‌కు కరోనా సోకినట్లు డాక్టర్లు చెప్పారు.

ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు వేరియంట్లు సోకి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆ డాక్టర్ టీకా రెండు డోసులు వేయించుకున్నారని మరో డాక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోకుంటే మాత్రం ప్రమాదం ఉండేదని అభిప్రాయపడుతున్నారు.