Petroleum : పెట్రోపై దేశ ఖజానాకు రూ.లక్ష కోట్లు

దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది. కరోనా నిబంధనలు తొలగిపోవడంతో కార్యకలాపాలు పెరిగాయి. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగింది ఖజానాకు ఆదాయం చేరింది.

Petroleum : పెట్రోపై దేశ ఖజానాకు రూ.లక్ష కోట్లు

Petroleum

Petroleum : కరోనా కష్టకాలంలో దేశ ఆదాయానికి భారీగా గండిపడింది. లాక్ డౌన్ ముగియడం, కార్యాలయాలు ప్రారంభం కావడంతో తిరిగి పుంజుకుంది. కేంద్రానికి ప్రధాన ఆదాయవనరైన ఇంధనం అమ్మకాలు భారీగా పెరిగాయి. దీనికి అధిక ధరలు జతకావడంతో దేశ ఖజానా ఆదాయం పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు పెట్రోలియం ఉత్పత్తులపై రూ. లక్ష కోట్ల ఆదాయం వచ్చినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వెల్లడించింది.

గత ఆర్ధిక సంవత్సరం ఇదే నెలల్లో రూ. 67,895 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 48 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇక గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే 2021-2022లో అదనంగా రూ.1 లక్ష కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ రూపేణ ఖజానాకు చేరే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 1.34 లక్షల కోట్ల విలువైన చమురు బాండ్లను జారీ చేశారు. వాటిలో రూ.3500 కోట్ల అసలును యూపీఏ అధికారంలో ఉన్నసమయంలో చెల్లించింది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ మిగిలిన 1.3 లక్షల కోట్లను అసలు, వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంది. ఎందుకు సంబందించిన వివరాలను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా మీడియా ముఖంగా తెలియచేశారు.

ప్రభుత్వ చమురు సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని 2025-26 ఆర్ధిక సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. దీనికోసం ఈ ఆర్ధిక సంవత్సరం ఎంత చెల్లించాలో ముందే ఓ ప్లాన్ చేసి పెట్టామని వివరించారు. 2021-22 లో రూ.10,000 కోట్లు, 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.