డిజిటల్ విలేజేస్ : కృతిమ మేథ

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 02:44 AM IST
డిజిటల్ విలేజేస్ : కృతిమ మేథ

హైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్‌గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్‌గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ శాఖల్లోనూ కృతిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు, ఈ టెక్నాలజీలు అనేక రంగాలకు ఉపయోగపడుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సర్వీసులను ఉపయోగించుకొనేందుకు 9 రంగాలను గుర్తించినట్లు తెలిపారు. వాహనాల్లో విద్యుత్ వ్యవస్థ, ఫొటోలు, వీడియోల నిర్వాహణ విశ్లేషణ వంటివి వీటిలో ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో గోయల్ వెల్లడించారు. 

కృతిమ మేథ సర్వీసుల కోసం జాతీయ పోర్టల్‌ని ఏర్పాటు చేయనుంది. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్ ద్వారా సేవలందిస్తామని…ప్రైవేటు వ్యాపార సంస్థలూ కూడా ఈ పోర్టల్ సేవలు వినియోగించుకోవచ్చని గోయల్ వెల్లడించారు. స్టార్టప్ రంగంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని…అందులో భాగంగా కృతిమ మేథ లాభాలను ప్రజల వద్దకు తెచ్చేందుకు జాతీయస్థాయిలో ఓ విస్తృతమైన కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.