MS Subbulakshmi : లక్ష చుక్కల్లో గాన గంధర్వ ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బొమ్మ

కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్‌ సుబ్బులక్ష్మి లక్ష చుక్కల్లో మెరిసిపోయారు. వేలూరు మ్యూజియంలో లక్ష చుక్కలతో సుబ్బులక్ష్మి చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది.వేలూరు కోటలోని మ్యూజియంలో లక్ష చుక్కలతో గీసిన కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్‌ సుబ్బులక్ష్మి చిత్రపటాన్ని బుధవారం నుంచి ప్రదర్శనకు ఉంచారు.

MS Subbulakshmi : లక్ష చుక్కల్లో గాన గంధర్వ ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బొమ్మ

One Lakhs Stars Ms Subbalaxmi Oicture (1)

one lakhs stars ms subbalaxmi oicture : MS సుబ్బులక్ష్మి. కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత,స్వర సామ్రాజ్ఞి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి. గానానికి మారుపేరు.సంగీతానికి నిలువెత్తు నిదర్శనం. సుబ్బులక్షి పేరు చెబితే..చెవుల్లో సంగీతం మారు మ్రోగుతుంది. సుబ్బులక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లుగా ఉంటుంది. నిండైన అందానికే అందం ఆమె నిండైనవిగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో MS సుబ్బులక్ష్మి శైలి విశిష్టమైనది. ఆమె గానం ధ్యానంలా సాగేది.

అటువంటి సుబ్బులక్ష్మి లక్ష చుక్కల్లో మెరిసిపోయారు.తమిళనాడులోని వేలూరు మ్యూజియంలో లక్ష చుక్కలతో వేసిన ఎంఎస్‌ సుబ్బులక్ష్మి చిత్రం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆమె నిండైన రూపాన్ని కళ్లముందు కదలాడిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా మ్యూజియంలకు ప్రజలను అనుమతిస్తున్న క్రమంలో వేలూరు కోటలోని మ్యూజియంలో లక్ష చుక్కలతో గీసిన కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్‌ సుబ్బులక్ష్మి చిత్రపటాన్ని బుధవారం నుంచి ప్రదర్శనకు ఉంచారు.

దీనిపై మ్యూజియం పర్యవేక్షకులు శరవణన్‌ మాట్లాడుతూ..వేలూరు సత్తువాచేరికి చెందిన కళాశాల విద్యార్థిని రాజేశ్వరి పేనాతో లక్ష చుక్కలు పెట్టి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి చిత్రలేఖనం గీసారని..ఈ చిత్రాన్ని ఆగస్టు 31వ తేదీ వరకు ప్రజల సందర్శనకు వుంచుతున్నామని తెలిపారు.