Amarnath : అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని గుర్తించింది ముస్లిం వ్యక్తే : ఫరూక్ అబ్దుల్లా

అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని మొదట గుర్తించింది ఒక ముస్లిం వ్యక్తి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత..జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

Amarnath : అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని గుర్తించింది ముస్లిం వ్యక్తే : ఫరూక్ అబ్దుల్లా

One To Spot 'lingam' In Amarnath Cave Was A Muslim Man

Shiva lingam in Amarnath cave..Farooq Abdullah : ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని మొదట గుర్తించింది ఒక ముస్లిం వ్యక్తి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత..జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. బూటా మాలిక్ అనే ముస్లిం వ్యక్తి అమర్ నాథ్ గుహను కనుగొన్నాడని పేర్కొన్నారు. ఏ ముస్లిం కూడా ఇంతవరకు మరే మతం పట్ల వేలెత్తి చూపలేదన్నారు. కాకపోతే 1990ల్లోనే ఇటువంటి ధోరణి కనిపించింది అని ఫరూక్ అంగీకరించారు. పహల్గామ్ కు చెందిన బూటా మాలిక్ అనే ముస్లిం వ్యక్తి అమర్ నాథ్ గుహలో శివలింగాన్ని చూసి..ఆ విషయాన్ని కశ్మీరీ పండిట్లకు చెప్పాడని..వ్యాఖ్యానించారు.

జమ్ము కశ్మీర్ ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ..అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు తాము వచ్చే ఎన్నికల్లో గుప్కర్ కూటమిలో కేంద్ర పాలిత ప్రాంతంలో పోటీ చేస్తామని వెల్లడించారు. పోగొట్టుకున్న మన గౌరవాన్ని తిరిగి పొందేందుకు కలిసికట్టుగా పోరాడాలన్నదే ప్రజల అభీష్టం కాబట్టి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నామని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా తెలిపారు.

కాగా.. వర్షాల కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమీక్షించిన అధికార యంత్రాంగం అమర్ నాథ్ యాత్రను మంగళవారం (జులై 5,2022)నుంచి నిలిపి వేశారు. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి యాత్రకు భక్తులను అనుమతించడం లేదని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,000కు పైగా భక్తులు అమర్ నాథ్ ను దర్శించుకున్నారు.