Open Bore well : మృత్యుంజయురాలు.. బోరుబావిలో పడి ప్రాణాలతో బయటకు వచ్చింది.

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు అధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది

Open Bore well : మృత్యుంజయురాలు.. బోరుబావిలో పడి ప్రాణాలతో బయటకు వచ్చింది.

Open Bore Well

Open Bore well : బోరుబావిలో పడితే ప్రాణాలతో తిరిగిరావడం పునర్జన్మ అనే చెప్పొచ్చు. దేశంలో చాలామంది చిన్నారులు బోరుబావుల్లో పడి ప్రాణాలు విడిచిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే గురువారం ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పుర్ జిల్లా దౌనీ గ్రామంలో జరిగింది. గురువారం మధ్యాహ్నం పొలంలో ఆడుకుంటున్న దివ్యాన్షి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది.

చదవండి : Madhya Pradesh : వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలి..లేకపోతే..ఉరి తీస్తా

పాప కనిపించకపోవడంతో తల్లి ఆ పరిసరాలు మొత్తం గాలించింది. బోరుబావిలోంచి ఏడుపు వినిపించడంతో బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఫలితం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించింది. వెంటనే వారు పోలీసులకు విషయం చేరవేయడంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్.. శుక్రవారం తెల్లవారుజామున 2గంటల వరకు కొనసాగింది.

చదవండి : Madhya Pradesh : స్కూల్ బస్సు మిస్.. చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య!

అధికారులు చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.