భారత్‌లో బ్లాక్ డే: ఉగ్ర దాహానికి మన సైనికులు బలైన రోజు

  • Published By: vamsi ,Published On : February 14, 2020 / 04:14 AM IST
భారత్‌లో బ్లాక్ డే: ఉగ్ర దాహానికి మన సైనికులు బలైన రోజు

భారత్‌లో ప్రతి ఒక్కరి గుండ మండించిన రోజు..  జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సైనికులు వీరమరణం పొందిన రోజు.. పక్కా వ్యూహాలతో పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రలో మన సైనికులను కోల్పోయిన రోజు..  2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.

ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడి చేసినట్లుగా ప్రకటించింది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించింది. సర్జికల్ స్ట్రయిక్స్‌ చేసి ఫిబ్రవరి 26 తెల్లవారుజామున పాకిస్తాన్ భూభాగంలో బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే పుల్వామా దాడి జరిగిన ఈరోజును భారత్ మొత్తం బ్లాక్ డే గా పరిగణించారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు పుల్వామాలో భారత సైనికుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ భారతదేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి మన అమర_జవాన్లకు నివాళులు అర్పించాలంటూ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అమరవీరులైన CRPF జవాన్లు వీళ్లే:

హెడ్ ​​కానిస్టేబుల్ నసీర్ అహ్మద్ (జమ్మూ కాశ్మీర్)

కానిస్టేబుల్ సుఖ్జిందర్ సింగ్ (పంజాబ్)

హెడ్ ​​కానిస్టేబుల్ జైమల్ సింగ్ (పంజాబ్)

కానిస్టేబుల్ రోహితాష్ లాంబా (రాజస్థాన్)

కానిస్టేబుల్ తిలక్ రాజ్ (హిమాచల్ ప్రదేశ్)

హెడ్ ​​కానిస్టేబుల్ విజయ్ సోరెంగ్ (జార్ఖండ్)

కానిస్టేబుల్ వసంత కుమార్ వి.వి (కేరళ)

కానిస్టేబుల్ సుబ్రమణ్యం జి (తమిళనాడు)

కానిస్టేబుల్ మనోజా కుమార్ బెహెరా (ఒడిశా)

కానిస్టేబుల్ జిడి గురు హెచ్ (కర్ణాటక)

హెడ్ ​​కానిస్టేబుల్ నారాయణ్ లాల్ గుర్జర్ (రాజస్థాన్)

కానిస్టేబుల్ మహేష్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)

హెడ్ ​​కానిస్టేబుల్ హేమరాజ్ మీనా (రాజస్థాన్)

హెడ్ ​​కానిస్టేబుల్ పికె సాహూ (ఒడిశా)

కానిస్టేబుల్ రమేష్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్)

హెడ్ ​​కానిస్టేబుల్ సంజయ్ రాజ్‌పుత్ (మహారాష్ట్ర)

కానిస్టేబుల్ కౌషల్ కుమార్ రావత్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ శ్యామ్ బాబు (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ అజిత్ కుమార్ ఆజాద్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ మనీందర్ సింగ్ అత్రి (పంజాబ్)

హెడ్ ​​కానిస్టేబుల్ బాబ్లూ సాంట్రా (పశ్చిమ బెంగాల్)

కానిస్టేబుల్ అశ్వని కుమార్ కయోచి (మధ్యప్రదేశ్)

కానిస్టేబుల్ రాథోడ్ నితిన్ శివాజీ (మహారాష్ట్ర)

కానిస్టేబుల్ భగీరత్ సింగ్ (రాజస్థాన్)

కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ (ఉత్తరాఖండ్)

హెడ్ ​​కానిస్టేబుల్ అవధేష్ కుమార్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ రతన్ కుమార్ ఠాకూర్ (బీహార్)

కానిస్టేబుల్ పంకజ్ కుమార్ త్రిపాఠి (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ జీత్ రామ్ (రాజస్థాన్)

కానిస్టేబుల్ అమిత్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ విజయ్ క్రి. మౌర్య (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్ (పంజాబ్)

హెడ్ ​​కానిస్టేబుల్ మనేశ్వర్ బుమాతారి (అస్సాం)

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ లాల్ (ఉత్తరాఖండ్)

హెడ్ ​​కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హా (బీహార్)

హెడ్ ​​కానిస్టేబుల్ రామ్ వకీల్ (ఉత్తర ప్రదేశ్)

కానిస్టేబుల్ సుదీప్ బిస్వాస్ (పశ్చిమ బెంగాల్)

కానిస్టేబుల్ శివచంద్రన్ (తమిళనాడు)

Pulwama