OnePlus Z phone లాంచింగ్ ఇండియాలోనే

  • Published By: Subhan ,Published On : May 28, 2020 / 06:07 AM IST
OnePlus Z phone లాంచింగ్ ఇండియాలోనే

కొద్ది వారాలుగా మొబైల్ యూసేజ్‌లో OnePlus హవానే కొనసాగుతోంది. లేటెస్ట్ మోడల్స్‌తో మార్కెట్ లో అప్‌డేటెడ్ గా ఉంటున్న  OnePlus లేటెస్ట్ మోడల్ Zను ఇండియాలోనే లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు వన్ ప్లస్ సీఈఓ పీటె లవు ఫాస్ట్ కంపెనీతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అయితే ఆ డివైజ్ పేరు నేరుగా చెప్పకుండా.. ‘త్వరలో ఓ కొత్త డివైజ్ ఇండియాలో లాంచ్ కాబోతుంది’ అంటూ కామెంట్ చేశారు. 

దీనిని బట్టే తెలుస్తోంది ఫస్ట్ డివైజ్ ఇండియాలోనే లాంచ్ అవుతుంది. విశ్వవ్యాప్తంగా మార్కెట్ సంపాదించుకున్న వన్ ప్లస్ .. తొలిసారి ఫస్ట్ డివైజ్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది. OnePlus Z phone కోసం పలుమార్లు ఆన్ లైన్లో ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంది. మార్కెట్లో మంచి పేరు సంపాదించుకోవడంతో.. ప్రపంచ దేశాల్లో మొబైల్స్‌లో లీడర్‌గా కొనసాగుతుంది. 

ఫోన్లు కాకుండా మిగిలిన ఉత్పత్తులు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వన్ ప్లస్ స్టాండర్ట్ ను మెయింటైన్ చేస్తాయని సీఈఓ చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల కంటే ముందు లీక్‌స్టర్ మ్యాక్స్ జే.. ఇదే ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. క్వాల్ కామ్ చిప్ సెట్ తో వస్తున్న తొలి ఫోన్ అని సీక్రెట్ చెప్పేశాడు. 

ఇంకా ఇతరులు కూడా చాలా విషయాలు చెప్పారు. 5G modem  built-in గా వస్తుండటం వంటి సీక్రెట్స్ బయటపడగా దీని ఖరీదుపై స్పష్టమైన అవగాహన లేదు. రూ.25వేల నుంచి 30వేలకు మధ్యలో ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Read: Redmi నుంచి 3 కొత్త 10X సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు భలే ఉన్నాయి!