OnePlus Nord 2 5G: మళ్లీ పేలిన వన్ ప్లస్ నార్డ్ 2, ప్యాంటు జేబులో పేలడంతో..

ఇండియాలో వన్ ప్లస్ బ్రాండ్ కు మంచి మార్కెట్టే ఉంది కానీ, వన్ ప్లస్ నార్డ్ 2 మిగతావాటి మాదిరి హిట్ కాలేకపోయింది. గతంలో జరిగిన మాదిరిగానే మళ్లీ ఫోన్ పేలింది.

OnePlus Nord 2 5G: మళ్లీ పేలిన వన్ ప్లస్ నార్డ్ 2, ప్యాంటు జేబులో పేలడంతో..

One Plus Nord 25g

OnePlus Nord 2 5G: ఇండియాలో వన్ ప్లస్ బ్రాండ్ కు మంచి మార్కెట్టే ఉంది కానీ, వన్ ప్లస్ నార్డ్ 2 మిగతావాటి మాదిరి హిట్ కాలేకపోయింది. గతంలో జరిగిన మాదిరిగానే మళ్లీ ఫోన్ పేలింది. అది వన్ ప్లస్ దీనికి సంబంధించిన ఫొటోలను ఒక యూజర్ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.

మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈ ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. తొడ భాగం కాలిపోయినట్లుగా అందులో స్పష్టంగా కనిపిస్తుంది. నవంబరు 3 బుధవారం చేసిన పోస్టుపై వన్ ప్లస్ టీం స్పందించింది. డైరక్ట్ గా మెసేజ్ చేసి వాస్తవం తెలియజేయాలని అడిగింది. ఆ తర్వాత కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

దీనిపై మీడియా ఫోకస్ అంతా పడటంతో నెట్టింట వైరల్ అయిన ఫొటోలపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నారు.

…………………………………………..: మహేష్, ప్రభాస్ మల్టీస్టారర్.. థమన్ ట్వీట్ వైరల్!

జులైలో లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 2 5జీ.. పాపులర్ మిడ్ రేంజ్ మోడల్ వన్ ప్లస్ నార్డ్ తర్వాత వచ్చింది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే రెండుసార్లు పేలిన కంప్లైంట్లు వచ్చాయి. త్వరలో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 2 పీఎసీ-మ్యాక్ ఎడిషన్ పై ఈ ఫోన్ ఫెయిల్యూర్ ప్రభావం కనిపిస్తుందా అనేది చూడాలి.