NIA investigation : దర్బాంగా పేలుళ్లు..అట్టముక్క వాడటం వల్లే ప్రమాద తీవ్రత తగ్గినట్లుగా గుర్తింపు

బీహార్‌లోని దర్బంగా పేలుళ్లు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో పేలుళ్ల కోసం అట్టుముక్కలు వాడటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని గుర్తించారు.

NIA investigation : దర్బాంగా పేలుళ్లు..అట్టముక్క వాడటం వల్లే ప్రమాద తీవ్రత తగ్గినట్లుగా గుర్తింపు

Darbhanga Blasts

Darbhanga blasts NIA investigation : బీహార్‌లోని దర్బంగా పేలుళ్లు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు ‘దర్బాంగా పేలుళ్ల కుట్రలో పేలుళ్ల కోసం అట్టుముక్కలు వాడటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని గుర్తించారు. చిన్న టానిక్ బాటిల్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ తో పాటు వైట్ షుగర్ అమర్చేందుకు పేపర్ ముక్క వాడాలని పైనుంచి ఆదేశాలు రావటంతో ఉగ్రవాదులు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్లు పేపర్ కు మదులు అట్టముక్ వాడారని..ట్రయల్ దశలో పేపర్ వాడటంతో మాలిక్ బ్రదర్స్ విఫలమయ్యారని తెలిపారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ తో పాటు వైట్ షుగర్ మూడు పేలుడు పదార్ధాలు కలపడం ఆలస్యం కావటంతో పెను ప్రమాదం తప్పి ప్రమాద తీవ్రత తగ్గిందని..మార్గ మధ్యలో పేలాల్సిన బాంబు దర్భంగాలోనే పేలిందని ఎన్ఐఏ అధికారులు తమ విచారణలో తేల్చారు.

కాగా బీహార్ లోనే దర్భంగాలో జరిగిన పేలుళ్లకు కుట్ర పాకిస్థాన్ కేంద్రంగా జరిగినట్టు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్న క్రమంలో ఈ పేలుళ్లలో హస్తం ఉందని అనుమానిస్తున్న పలువురిని హైదరాబాద్ పోలీసులు నసీర్ మాలిక్ , ఇమ్రాన్ మాలిక్ అనే ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.ఈ దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ పేలుళ్లలో ప్రధాన అనుమానితుడు నసీర్ మూడుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లొచ్చినట్లు తేలింది.

యూపీలో ఖైరానాకు చెందిన నసీర్ 20 ఏళ్ల కింద హైదరాబాద్ కు వచ్చి అసిఫ్ నగర్ లో స్థిరపడ్డాడు. బట్టల వ్యాపారం చేస్తూ హైదరాబాద్ కు చెందిన యువతినే వివాహం పెళ్లి చేసుకున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో నసీర్ తన సోదరుడు ఇమ్రాన్ మాలిక్ ను కూడా నెమ్మదిగా హైదరాబాద్ కు తీసుకొచ్చి అసిఫినగర్‌లోనే ఉంచాడు. వీళ్లిద్దరూ… ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు కొన్నిరోజుల క్రితమే అనుమానించారు.

జూన్ 15న సికింద్రాబాద్- దర్బంగా రైలులో రసాయన బాంబును మాలిక్ సోదరులు అమర్చారు. చీరల పార్శిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను నిందితులు దాచిపెట్టారు.ఈ పార్శిల్ను దర్బాంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్ కార్డు చూపించి పంపించారు. దర్బాంగాలో పార్శిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసిఉంది. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ నెంబర్ గురించి ఎంక్వయిరీ చేయగా అది కూడా నకిలీదే నని తేలింది. 17న దర్బాంగాలో పార్శిల్ను రైల్లోంచి దింపిన తరువాత అక్కడ చిన్నపాటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ ఈ పేలుడు సందర్భంగా రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా విచారణలో విషయాలు వెల్లడవుతున్నాయి.

ఈ కేసులో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై ఎన్‌ఐఏ పాట్నాకు తరలించింది. మరోసారి నిందితులను ఎన్ఐఏ కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. మల్లెపల్లి కేంద్రంగా మాలిక్ సోదరులు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించినట్టు గుర్తించారు. పేలుడు వెనుక కుట్రదారులు పూర్తి వివరాలను రాబడుతున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ విచారణలో పూర్తి వివరాలనురాబట్టేందుకు అధికారులు మాలిక్ సోదరుల్ని ప్రశ్నిస్తున్నారు.