Onion Prices : ఉల్లి ధరలు, ఎగమతుల నిషేధంపై కేంద్రం కీలక ప్రకటన

ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు.. ఇంకో వైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పుల నుంచి నూనెల వరకు.. ఒకటని కాదు.. దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి.

Onion Prices : ఉల్లి ధరలు, ఎగమతుల నిషేధంపై కేంద్రం కీలక ప్రకటన

Onion Prices

Onion Prices : ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు.. ఇంకో వైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పుల నుంచి నూనెల వరకు.. ఒకటని కాదు.. దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు కుదేలవుతున్నాడు. రోజురోజుకి పెరిగిపోతున్న ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు. ఏం తినాలి? ఎలా బతకాలి? అని ఆందోళన చెందుతున్నాడు. రీసెంట్ గా ఉల్లి.. కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. వారం రోజుల్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. రిటైల్ మార్కెట్ లో నాణ్యమైన కిలో ఉల్లి ధర రూ.50 నుండి రూ.60 వరకు పలుకుతోంది. ముందు ముందు ధర మరింత పెరిగే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఉల్లి ధరలు కూడా పెరగడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..కాల్ కట్ అయినా సులభంగా జాయిన్ కావొచ్చు

ఈ క్రమంలో ఉల్లి ధరలపై కేంద్రం స్పందించింది. కీలక ప్రకటన చేసింది. దేశంలో ఉల్లిగ‌డ్డ‌ల ధ‌ర‌లు త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం ఉల్లి ధ‌ర‌లు మ‌రీ ఎక్కువ స్థాయిలో ఏమీ లేవ‌ని కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ అభిప్రాయపడింది. ఉల్లి ధ‌ర‌ల‌పై అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం ఉల్లి ఎగుమ‌తుల‌పై ఎటువంటి నిషేధం అవ‌స‌రం లేద‌ంది. రాష్ట్రాల‌కు కిలో ఉల్లిని రూ.26కు ఇస్తున్న‌ట్లు కేంద్ర ఆహార శాఖ వెల్లడించింది. దేశ‌వ్యాప్తంగా ఆవ నూనె ఉత్ప‌త్తి 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు పెరిగిన‌ట్లు కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ కార్య‌ద‌ర్శి సుధాన్షు పాండే తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలోగా ఆవ నూనె ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ాయన్నారు.

Weight Loss : ప్రసవం తరువాత బరువు తగ్గటం ఎలా?

ఇండోనేషియా, మ‌లేషియాలో కూలీల స‌మ‌స్య‌ల వ‌ల్ల .. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్లు ఆయ‌న వివరించారు. కానీ ఇండియాలో మాత్రం పామాయిల్ ధ‌ర‌లు త‌గ్గుతున్న‌ట్లు ఆహార శాఖ కార్య‌ద‌ర్శి స్ప‌ష్టం చేశారు. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఇండియాలో నిత్యావ‌స‌ర ధ‌ర‌ల నియంత్ర‌ణ వేగంగా జ‌రుగుతోందని, కేంద్ర- రాష్ట్ర ప్ర‌భుత్వాల చొర‌వ‌తో ఇది సాధ్య‌మవుతున్న‌ట్లు సుధాన్షు చెప్పారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌ను త‌గ్గించి, వినియోగ‌దారుల‌కు ఊరట కల్పించేందుకు కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ నిత్యం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వెల్లడించారు.