Pizza Cheating : గూగుల్‌లో చూసి పిజ్జా ఆర్డర్ చేశాడు, రూ.65వేలు పొగొట్టుకున్నాడు

ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన కూడా కల్పించారు. అయినా ఇంకా చాలామంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త అడ్డంగా దగాపడ్డాడు. వంద రూపాయలు కూడా ఖరీదు చేయని పిజ్జా కోసం ఏకంగా రూ.65వేలు పొగొట్టుకున్నాడు.

Pizza Cheating : గూగుల్‌లో చూసి పిజ్జా ఆర్డర్ చేశాడు, రూ.65వేలు పొగొట్టుకున్నాడు

Pizza Cheating

Pizza Cheating : ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన కూడా కల్పించారు. అయినా ఇంకా చాలామంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త అడ్డంగా దగాపడ్డాడు. వంద రూపాయలు కూడా ఖరీదు చేయని పిజ్జా కోసం ఏకంగా రూ.65వేలు పొగొట్టుకున్నాడు.

పలి హిల్ లోని నర్గీస్ దత్ రోడ్డులో 59ఏళ్ల వ్యాపారవేత్త నివాసం ఉంటాడు. అతడికి పిజ్జా తినాలని అనిపించింది. వెంటనే ఆన్ లైన్ లో ఆర్డర్ చేయాలని నిర్ణయించాడు. పిజ్జా కోసం గూగుల్ లో కాంటాక్ట్ నెంబర్ సెర్చ్ చేశాడు. గూగుల్ సెర్చ్ చేయగా అతడికి ఫ్రాన్సికో పిజ్జా కాంటాక్ట్ నెంబర్లు కనిపించాయి. అయితే అవి ఫేక్ అని, మోసగాళ్లు తమ నెంబర్లను అలా ఉంచారనే విషయం అతడికి తెలీదు. పాపులర్ బ్రాండ్స్ పేర్లతో చీటర్లు తమ కాంటాక్ట్ నెంబర్లు గూగుల్ లో పెడతారు. ఈ విషయం తెలియని బిజినెస్ మ్యాన్.. ఆ నెంబర్ కి కాల్ చేశాడు.

కాల్ ఎత్తిన వ్యక్తి మరో నెంబర్ నుంచి మేమే కాంటాక్ట్ చేస్తామని చెప్పాడు. మరో నెంబర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. తనను మేనేజర్ గా పరిచయం చేసుకున్నాడు. అడ్వాన్స్ పేమెంట్ పంపాలని కోరుతూ బిజినెస్ మ్యాన్ కి లింక్ పంపాడు. ఇది మోసం అని తెలియని బిజినెస్ మెన్ అతడు పంపిన లింక్ ఓపెన్ చేసి అందులో వివరాలన్నీ నింపాడు. ఆ తర్వాత అతడికి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని కూడా షేర్ చేశాడు. అంతే అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు కట్ అయ్యాయి. దీంతో అతడికి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే వారికి కాల్ చేశాడు. ఓ పిజ్జా కోసం అంత డబ్బు ఎందుకు కట్ అయ్యిందని అడిగాడు.

జరిగిన దానికి క్షమించాలని ఆ మోసగాడు… బిజినెస్ మ్యాన్ ని అడిగాడు. పొరపాటు జరిగిందని కబుర్లు చెప్పాడు. మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తామని నమ్మబలికాడు. మరో ఓటీపీ వస్తుంది అది షేర్ చేయాలని చెప్పాడు. ఇదంతా నిజమే అని నమ్మిన వ్యాపారవేత్త మరోసారి తన ఫోన్ కి వచ్చిన ఓటీపీని వారికి షేర్ చేశాడు. అంతే.. అతడి అకౌంట్ నుంచి రూ.65వేలు కట్ అయ్యాయి. ఇలా నాలుగు ట్రాన్సాక్షన్స్ జరిగాయి.

ఇంతలో క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్లు బిజినెస్ మ్యాన్ కి కాల్ చేశారు. మీరు ఎవరికైనా పేమెంట్స్ చేస్తున్నారా? అని అడిగారు. లేదని బిజినెస్ మ్యాన్ చెప్పాడు. దీంతో క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్లు.. మీరు మోసపోయారని అతడికి చెప్పారు. అంతే, బిజినెస్ మ్యాన్ లబోదిబోమన్నాడు. పోలీసులను ఆశ్రయించాలని ఫిర్యాదు చేయాలని అతడితో చెప్పారు. వెంటనే బాధితుడు ఖార్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.