Education in Forest : చదువుకోవటానికి అడువుల బాట పట్టిన పిల్లలు..

చిన్న పిల్లలు చదువుకోవాటానికి అడవులకు వెళ్లాల్సి వచ్చింది. పూర్వకాలంలోగా..ఆశ్రమాల్లో ఉండే గురువుల వద్దకు వెళుతున్నారా ఏంటీ ఈ పిల్లలు అనుకుంటున్నారా? అదేం కాదు..ఇది కరోనా కాలపు తిప్పలు. విద్యార్ధులు అడవులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్న పరిస్థితి.

Education in Forest : చదువుకోవటానికి అడువుల బాట పట్టిన పిల్లలు..

Students Go Jungle For Online Classes (1)

students go jungle for online classes : అడవి ఎంత అందంగా ఉంటుందో అంత భయపెడుతుంది. పెద్దవాళ్లే అడవుల్లోకి వెళ్లటానికి భయపడతారు.కానీ చిన్న పిల్లలు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే చదువు కోవటానికి. అదేంటీ చదువుకోవాలంటే స్కూలుకు వెళాతారు గానీ అడవులకు వెళ్లటమేంటీ అనుకోవచ్చు. మరి ఆ పిల్లలు చదువుకునేది అడవుల్లోనే. మళ్లీ ఇంకో డౌట్ వచ్చుంటుంది. చదువుకోవటానికి అడవుల్లోకెందుకు? పూర్వకాలంలోగా..ఆశ్రమాల్లో ఉండే గురువుల వద్దకు వెళుతున్నారా ఏంటీ ఈ పిల్లలు అనుకుంటున్నారా? అదేం కాదు..ఇది కరోనా కాలపు తిప్పలు. విద్యార్ధులు అడవులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది.

నేడు అంతా ఆన్ లైన్ క్లాసుల కోసం చెట్లె ఎక్కి..డాబాల మీదకు ఎక్కి..చదువుకుంటున్నారని.. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్ రావటంలేదు. ఇదిగో ఈ విద్యార్ధుల పరిస్థితి కూడా అదే. అందుకే అడవిబాట పట్టారు ఒడిశాలోని కొంతమంది విద్యార్ధులు. సిగ్నల్స్ కోసం విద్యార్ధులు సెల్ ఫోన్ పట్టుకుని వెదుక్కుంటున్నారు. అలా వెతగ్గా వెతగ్గా..వారికి అడవిలోపల సిగ్నల్స్ దొరుకుతున్నాయి. దీంతో వేరే దిక్కు లేక ఓ పక్క ఏ జంతువు ఎటునుంచి దాడి చేస్తుందోననే భయంతోనే ప్రతీరోజూ అడవుల్లోకి వెళ్లి చదువుకుంటున్నారీ ఒడిశాలోని గంజాం జిల్లాలోని విద్యార్ధులు.

ఒడిశాలోని బిరులింగార్ అనే గ్రామం.ఎక్కడో కొండలపై ఉంటుంది. ఆ ఊరికి మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేదు. కానీ రోజూ తెల్లారితే ఆన్‌లైన్ క్లాసులు తప్పట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక విద్యార్థులు తమ చేతుల్లో మొబైళ్లు పట్టుకొని చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతుంటే..ఒక్కొక్కరికీ ఒక్కో చోట సిగ్నల్స్ దొరుకుతున్నాయి. అలా దొరికిన చోటే కూర్చుని ఆన్ లైన్ పాఠాలు వింటున్నారు. ఎలాగైనా చదువుకోవాలి అనే కోరిక ఆ చిన్నారుల్ని అడవుల బాట పట్టేలా చేస్తోంది. పాములు, దోమలు,రకరకాల పురుగులు దాడి చేసే ప్రమాదం ఉన్నా అడవిలోనూ చదువుకుంటున్నారు. అలా చదువుకోవటానికి రోజూ కిలోమీటర్లు నడిచి వెళ్లి అడవుల్లో ఆన్‌లైన్ క్లాసులు పూర్తయ్యాక… ఇళ్లకు వస్తున్నారు.

ఈ పరిస్థితిపై వినీతా కుమారీ మిశ్రా అనే టీచర్ మాట్లాడుతూ..గత సంవత్సరం ఆన్ లైన్ క్లాసులకు టీచర్లు ఇంటింటికీ తిరిగి పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాం. కానీ అలా ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి చెప్పటంతో లెసన్స్ పూర్తవ్వట్లేదు. సమయం వృథా అవుతోంది. అందుకే ఆన్‌లైన్ క్లాసులు చెప్పాల్సి వస్తోంది..కానీ సిగ్నల్స్ లేక పిల్లలు అడవుల్లోకి వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని ఇది ప్రమాదకరమైనదే అయినా తప్పనిపరిస్థితి అని వాపోయారామె.

సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల చదువులే కాదు ఇంకా చాలా సమస్యలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్‌కి కాల్ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. గంటల కొద్దీ టైమ్ పడుతోంది. ఈలోగా ప్రాణాలు పోయే పరిస్థితులున్నాయి. ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రకాష్ నాయక్ అనే బిరులింగార్ గ్రామ వాసి తెలిపారు. ఇలా ఒడిశాలోనే కాదు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది.