Vaccine Registration: ‘కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు’

కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Vaccine Registration: ‘కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు’

Vaccine Registration

Vaccine Registration: కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు 18ఏళ్లు పైబడ్డ వారు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి.. వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఆశా కార్యకర్తలు సహకారం అందించి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. నగరాల్లో వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కూడా కల్పించారు. రిజిస్ట్రేషన్ కోసం 1075 హెల్ప్ లైన్ కూడా వాడుకోవచ్చు. ఈ సదుపాయం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి సక్సెస్‌ఫుల్‌గా వ్యాక్సినేషన్ చేయాలనేదే ప్రధాన ఉద్దేశ్యం.

ట్రైబల్ ఏరియాలో నమోదవుతోన్న వ్యాక్సినేషన్ వివరాలిలా ఉన్నాయి.
* 176 ట్రైబల్ జిల్లాల్లో 128జిల్లాలు మిగిలిన ఆల్ ఇండియా వ్యాక్సినేషన్ కంటే బెటర్ గా నిర్వహిస్తున్నారు.
* జాతీయ వ్యాక్సినేషన్ సగటు కంటే.. ఎక్కువ నడిచి వెళ్లి వ్యాక్సినేషన్ వేయించుకునే వారు ట్రైబల్ జిల్లాల్లోనే బాగా ఉన్నారు.
* లింగ నిష్పత్తిలోనూ ట్రైబల్ జిల్లాల్లోనే ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.