Tamilnadu: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి అసెంబ్లీలో రెండోసారి ఏకగ్రీవ ఆమోదం.. ఈసారైనా గవర్నర్ సంతకం పడేనా?

దే సమయంలో ఈ విషయమై గవర్నర్‌ రెండు నిర్ణయాలను మాత్రమే తీసుకోగలుగుతారని చెబుతున్నారు. ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయడం, లేదా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం మాత్రమే గవర్నర్‌ ముందున్న మార్గాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం అమలులో ఉండటం వల్ల ఈ బిల్లును రాష్ట్రపతికి ఎట్టి పరిస్థితులలోనూ పంపరని మరికొందరు న్యాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు

Tamilnadu: గతంలో శాసనసభ ఆమోదించిన పంపించిన ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి గవర్నర్ ఆర్ఎన్ రవి నుంచి ఆమోదం లభించలేదు. అయితే తాజాగా ఆ బిల్లుకు రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. మరి ఈసారైనా గవర్నర్ స్పందిస్తారా అనే డైలమా కొనసాగుతోంది. కాగా, ఈ విషయమై గవర్నర్‌ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం రాష్ట్ర న్యాయశాఖ ఉన్నతాధికారుల రాజ్‌భవన్‌కు వెళ్ళి ఎనిమిది పేజీల ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధచట్టం బిల్లును అక్కడి ఉన్నతాధికారులకు అందజేశారు.

Tirupathi Lok Sabha Constituency : వెంకటేశుని సన్నిధి తిరుపతిలో ఆసక్తికర రాజకీయం..పట్టుమీద వైసీపీ..పంతం పట్టిన టీడీపీ…

అదేరోజు రాత్రి ఢిల్లీ పర్యటనను ముగించుకుని నగరానికి తిరిగొచ్చిన గవర్నర్‌ ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్‌ గతంలో లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన వివరాలను జతచేసినట్లు సమాచారం. శాసనసభలో రెండోసారి ఆమోదించిన ఈ బిల్లును రాజ్యాంగ ధర్మాసన చట్టం ప్రకారం తిరస్కరించే వీలులేదని న్యాయశాఖ మంత్రి రఘుపతి స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం బిల్లును గవర్నర్‌ తిరస్కరించేందుకు వీలులేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Amit Shah: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్లు

అదే సమయంలో ఈ విషయమై గవర్నర్‌ రెండు నిర్ణయాలను మాత్రమే తీసుకోగలుగుతారని చెబుతున్నారు. ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయడం, లేదా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం మాత్రమే గవర్నర్‌ ముందున్న మార్గాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం అమలులో ఉండటం వల్ల ఈ బిల్లును రాష్ట్రపతికి ఎట్టి పరిస్థితులలోనూ పంపరని మరికొందరు న్యాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో బిల్లుపై వెనువెంటనే సంతకం చేయకుండా గవర్నర్‌ ఒకటి రెండు నెలల పాటు పెండింగ్‌లో ఉంచి, ఆ తర్వాత సంతకం చేస్తారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు