వాట్సప్‌‌లోనే స్కూల్ పాఠాలు

వాట్సప్‌‌లోనే స్కూల్ పాఠాలు

లాక్‌డౌన్ సమయంలో స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాట్సప్ చక్కగా ఉపయోగపడుతుంది. వాట్సప్‌ ఆధారంగా డిస్టెన్స్‌ వర్చువల్‌ లర్నింగ్‌ విధానాన్ని కొన్ని పాఠశాలలు అనురిస్తున్నాయి. ఈ పద్ధతితో టీచర్‌, పిల్లాడు ఎక్కడివారు అక్కడే ఉండి క్లాసులు వినొచ్చు.. నేర్పొంచొచ్చు. ఎలాగూ లాక్‌డౌన్ సమయమే కాబట్టి పేరెంట్స్ ఇంటి దగ్గరే ఉండటంతో పిల్లలను వారే పర్యవేక్షించొచ్చు. వాట్పాప్‌‌తో పాఠశాల, పిల్లలతో లింక్ చేసుకోవచ్చు. 
 
ప్రతీ రోజూ పిల్లల తల్లిదండ్రుల వాట్సప్‌కు ఒక వర్క్‌షీట్‌ పంపిస్తారు. చెప్పిన టైంలోగా దానిని పిల్లలు పరిష్కరించాలి. వారు రాసిన ఆన్సర్ షీట్లను తల్లిదండ్రులు ఇమేజ్‌రూపంలో తిరిగి టీచర్‌కు పంపించాలి. టీచర్లు తప్పులు దిద్ది తిరిగి తల్లిదండ్రులకు పంపిస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక టీచర్‌ పిల్లలకు ఫోన్‌చేసి ఆ రోజు జరిగిన క్లాస్ గురించి పిల్లలతో మాట్లాడతారు. పూర్తిచేసిన వర్క్‌షీట్‌లోని తప్పొప్పులను వారితో చర్చిస్తారు. 

అంతేకాకుండా ప్రతీరోజు పిల్లలకు రీడింగ్‌ రివిజన్‌ టార్గెట్స్‌ కేటాస్తున్నారు. కేవలం పాఠ్య పుస్తకాల్లోని అంశాలేకాకుండా.. జనరల్‌ బుక్స్‌, స్టోరీ చదివించడం లాంటివి సైతం చేయిస్తున్నారు. అంతేకాకుండా చదివారా.. ? లేదా.. ? అనే దానిపై సైతం పర్యవేక్షణ జరుపుతున్నారు. చదివిన బుక్‌, స్టోరీ అంశాన్ని క్లుప్తంగా రాసి పంపమని సూచిస్తున్నారు. ఇదే కాకుండా ఉన్నత తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలను వీడియోలుగా చిత్రీకరించి, తల్లిదండ్రులకు పంపించడం, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి లింక్‌పంపడం చేస్తున్నారు. 

డిస్టెన్స్‌ వర్చువల్‌ లెర్నింగ్‌కు పిల్లలు, తల్లిదండ్రుల నుంచి అద్భుత స్పందన వస్తుంది రాష్ట్ర స్థాయి అధికారులు అంటున్నారు. (నాలుగు వందల కోట్ల మాస్క్‌లు ఎగుమతి చేసిన చైనా)