Sanskrit in India: దేశంలో సంస్కృతం మాట్లాడేవాళ్లు 24,821 మందే.. వెల్లడించిన కేంద్రం

దేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ భాష మాట్లాడేవాళ్ల సంఖ్య 24,821. అంటే మన జనాభాలో 0.002 శాతం మాత్రమే.

Sanskrit in India: దేశంలో సంస్కృతం మాట్లాడేవాళ్లు 24,821 మందే.. వెల్లడించిన కేంద్రం

Sanskrit in India: దేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశం మొత్తం మీద 24,821 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడగలరని కేంద్రం తాజాగా వెల్లడించింది. కేంద్ర భాషా శాఖ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా, ఆగ్రాకు చెందిన డా.దేవాశిష్ భట్టాచార్య సేకరించిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది.

Srivari Brahmotsavam: చిన్న‌శేష వాహ‌నంపై బ‌ద్రి నారాయ‌ణ అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి… వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య 24,821. అంటే జనాభాలో 0.002 శాతం మాత్రమే ఈ భాష మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగంలో సంస్కృతాన్ని మైనారిటీ భాషగా గుర్తించలేదు. ఎందుకంటే సంస్కృతానికి భారత అధికారిక భాషగా గుర్తింపు ఉంది. అయినప్పటికీ సంస్కృతానికి ఆదరణ తక్కువగానే ఉంది. 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంస్కృతానికి రెండో అధికారిక భాషగా గుర్తింపునిచ్చింది. సంస్కృతంకన్నా ఎక్కువగా బిహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఉర్దూ మాట్లాడగలరు. మరోవైపు సంస్కృతం వంటి కనుమరుగైపోతున్న భాషలను రక్షించేందుకు కేంద్రీయ హిందీ సంస్థాన్ (కేహెచ్ఎస్) వంటివి కృషి చేస్తున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

తమ సంస్థ సంస్కృతంతోపాటు ప్రాచీన భాషలైన బ్రజ్ భాషా, అవధి, భోజ్‌పురి వంటి 18 భాషల్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తోందని కేహెచ్ఎస్ సభ్యులు తెలిపారు. ఇప్పటికే వీటిలో మూడు భాషలకు సంబంధించిన డిక్షనరీలు రూపొందించడం పూర్తైందని, మిగతా 15 భాషల డిక్షనరీలు రూపొందిస్తున్నట్లు కేహెచ్ఎస్ సంస్థకు చెందిన భాషా శాస్త్రవేత్త డా.సప్న తెలిపారు.