Delhi-Mumbai Expressway: రేపే ప్రారంభంకానున్న ముంబై-ఢిల్లీ ఎక్స్‭ప్రెస్‭వే మొదటి దశ.. దేశంలోనే అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వే విశేషాలేంటో తెలుసా?

దేశంలో అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వే అయిన ముంబై-ఢిల్లీ ఎక్స్‭ప్రెస్‭వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అనుకుంటున్న ఈ ఎక్స్‭ప్రెస్‭వే మొదటిదశ అయిన ‘ఢిల్లీ-జైపూర్’ మార్గం ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎక్స్‭ప్రెస్‭వే విశేషాలేంటో చూద్దామా..

Delhi-Mumbai Expressway: రేపే ప్రారంభంకానున్న ముంబై-ఢిల్లీ ఎక్స్‭ప్రెస్‭వే మొదటి దశ.. దేశంలోనే అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వే విశేషాలేంటో తెలుసా?

opening of Delhi-Mumbai Expressway stretch tomorrow

Delhi-Mumbai Expressway: దేశంలో అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వే అయిన ముంబై-ఢిల్లీ ఎక్స్‭ప్రెస్‭వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అనుకుంటున్న ఈ ఎక్స్‭ప్రెస్‭వే మొదటిదశ అయిన ‘ఢిల్లీ-జైపూర్’ మార్గం ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎక్స్‭ప్రెస్‭వే విశేషాలేంటో చూద్దామా..

*ముంబై-ఢిల్లీ ఎక్స్‭ప్రెస్‭వే మొత్తం పొడవు 1,386 కిలో మీటర్లు
*ఢిల్లీలోని డీఎన్‭డీ ఫ్లైఓవర్ నుంచి ముంబైలోని జేఎన్‭పీటీ వరకు విస్తరించి ఉంది
*ఎనిమిది వరుసలతో నిర్మితమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వే ఇదే
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే పూర్తైతే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగం తగ్గుతుంది. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ప్రయాణం, 12 గంటలకు తగ్గుతుంది
*ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (6 రాష్ట్రాలు) రాష్ట్రాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే 93 పీఎం గతిశక్తి ఎకనామిక్ నోడ్స్, 13 పోర్టులు, 8 మేజర్ ఎయిర్‭పోర్టులు, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను కలుపుకుని పోతుంది
*వన్యప్రాణుల సంరక్షణ కోసం ఓవర్ పాస్, అండర్ పాసులు నిర్మించిన ఆసియాలోని మొట్టమొదటి ఎక్స్‭ప్రెస్‭వే ఇదే
*దీని కోసం మొత్తంగా 25,000 లక్షల టన్నుల బిటుమెన్ ఉపయోగించారు. అలాగే శిక్షణ పొందిన 4,000 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారు
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే వల్ల ఏడాదికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం, 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఆదా అవుతుంది
*ఈ ఎక్స్‭ప్రెస్‭వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు
*విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‭ప్రెస్‭వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు
*120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఉంటుంది. దేశంలో అత్యంత వేగవంతమైన రోడ్డు ఇదే
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే మీద హెలిపాడ్లు, ట్రౌమా కేర్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు