Operation Ganga : కొనసాగుతున్న ఆపరేషన్ గంగ.. 50 విమానాల్లో చేరుకున్న 11వేల మంది భారతీయులు

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా యుక్రెయిస్ సరిహద్దులోని భారతీయులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తోంది.

Operation Ganga : కొనసాగుతున్న ఆపరేషన్ గంగ.. 50 విమానాల్లో చేరుకున్న 11వేల మంది భారతీయులు

Operation Ganga Over 11000 Indians Evacuated From Ukraine So Far

Operation Ganga : యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యుక్రెయిస్ సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తోంది. ఇప్పటివరకూ 50 విమానాల్లో యుక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారత్‌కు 11వేల మంది భారతీయులు చేరుకున్నారు. శనివారం (మార్చి 5) కూడా యుక్రెయిన్ సరిహద్దుల నుంచి భారత్‌కు మరో 15 విమానాలు చేరుకోనున్నాయి. ఇందులో 11 పౌర విమానాలు ఉండగా.. నాలుగు వాయుసేన విమానాలు ఉన్నాయి. మొత్తంగా యుక్రెయిన్ నుంచి 2,200 మంది భారతీయులు విమానాల్లో స్వదేశానికి చేరుకోనున్నారు.

ఖర్కివ్, సుమీలో సుమారు వెయ్యి మంది భారతీయులు చిక్కుకున్నారు వారిని సేఫ్‌గా భారత్ కు తరలించేందుకు కేంద్రం అన్ని ఏర్పాటు చేస్తోంది. ఈశాన్య యుక్రెయిన్‌లో సుమీ నగరం చాలా చిన్నది.. తూర్పున రష్యా సరిహద్దుల్లో సమీపంలో ఈ సుమీ నగరం ఉంది. దీనికి 50 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సరిహద్దు ఉంది. సుమీ నగరానికి పశ్చిమాన 1200 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో పోలండ్, హంగరీ, రొమానియా సరిహద్దులు ఉన్నాయి. సుమీ, ఖార్కీవ్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వీలైనంత తొందరగా రష్యాకు చేరవేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Operation Ganga Over 11000 Indians Evacuated From Ukraine So Far (1)

Operation Ganga Over 11000 Indians Evacuated From Ukraine So Far

మరోవైపు.. యుక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో అక్కడి చిక్కుకున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్తుండగా వారిని బందీలుగా చేసుకుంటున్నారంటూ రష్యా ప్రధానంగా ఆరోపిస్తోంది. అయితే రష్యానే భారతీయ పౌరులను తమ బందీలుగా చేసుకుంటుందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశానికి చేరుకోవడంలో భారతీయ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

భారత రాయబారి కార్యాలయ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఆపరేషన్ గంగలో భాగంగా చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులు కూడా స్వయంగా అక్కడికి వెళ్లి భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

Read Also : Russia Ukraine War : ఆపరేషన్ గంగ వేగవంతం.. యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 26 విమానాలు..