Operation Kaveri : సూడాన్ నుంచి ప్రాణాలతో వస్తామనుకోలేదు .. సురక్షితంగా తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు

సూడాన్ లోని అత్యంత దారుణ పరిస్థితుల నుంచి బయట పడతం అని అస్సలు అనుకోలేదని..ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని తినటానికి తిండే కాదు తాగటానికి గుక్కెడు నీరు కూడా దొరటంలేదు. ఎటు నుంచి ఏ బాబు వచ్చి మీద పడుతుందో..ఏ తూటా ఎటు నుంచి దూసుకొచ్చి ప్రాణాలు తీస్తుందోననే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించాం.

Operation Kaveri : సూడాన్ నుంచి ప్రాణాలతో వస్తామనుకోలేదు .. సురక్షితంగా తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు

Operation Kaveri

Operation Kaveri : సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్‭ నుంచి భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ పేరుతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీంట్లో భాగంగా ఇప్పటికే 360 మంది భారతీయులు బుధవారం (ఏప్రిల్ 26,2023) సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. సూడాన్‭లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ పేరుతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే మొదటి విమానం ఇండియాకు చేరుకుంది.

సూడాన్ నుంచి వచ్చినవారిలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చీరాల వాసి విష్ణువర్ధన్ కూడా ఉన్నారు. తాను సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న సందర్భంగా విష్ణువర్థన్ ఆనందం వ్యక్తంచేస్తూ సూడాన్ లో పరిస్థితులు గురించి వివరించారు. సూడాన్ లో ఉండలేం..ఎప్పుడెప్పుడు భారత్ వచ్చేద్దామని అనిపించింది. అక్కడి పరిస్థితులకు చాలా భయం వేసిందని..సురక్షితంగా తిరిగి రావడం ఒక కలలా అనిపిస్తోందని ఆనందం వ్యక్తంచేశారు.

సూడాన్ లోని అత్యంత దారుణ పరిస్థితుల నుంచి బయట పడతం అని అస్సలు అనుకోలేదని..ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని తినటానికి తిండే కాదు తాగటానికి గుక్కెడు నీరు కూడా దొరటంలేదని తెలిపారు.బయట తూటాలు,బాంబులు పడుతున్నాయి ఎప్పుడు ఎటు నుంచి ఏ బాబు వచ్చి మీద పడుతుందో..ఏ తూటా ఎటు నుంచి దూసుకొచ్చి ప్రాణాలు తీస్తుందోననే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించామని అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టారు.

ప్రయివేట్ వెహికిల్‌లో ఫోర్ట్ సూడాన్‌కు చేరుకున్నామని..అక్కణ్ణుంచి కొందరిని ఎయిర్ లిఫ్ట్ చేస్తే, ఇంకొందరినీ షిప్ ల్లో జెడ్డా కు తరలిస్తున్నారని తెలిపారు. నేను ఆరేళ్లుగా సుడాన్ లోని సెరామిక్ కంపెనీలో పనిచేస్తున్నా ..నేను అక్కడ నుంచి బయటపడటానికి జేడ్డా నుంచి స్పెషల్ ఫ్లైట్ లో భారత్ కు వచ్చానని వెల్లడించారు విష్ణువర్థన్. క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి,ప్రధాని మోదికి,ఏపీ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు విష్ణు.