Jawan Rakeshwar Singh : జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం ఆపరేషన్ కుకూన్

మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టారు. జవాన్ విడుదల బాధ్యతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్‌కు అప్పగించారు.

Jawan Rakeshwar Singh : జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం ఆపరేషన్ కుకూన్

Jawan Rakeshwar Singh

Jawan Rakeshwar Singh : మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టారు. జవాన్ విడుదల బాధ్యతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్‌కు అప్పగించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్.. ఇప్పటికే మావోయిస్టుల దాడిపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారు.

తెర్రం అడవుల్లో జరిగిన దాడికి సంబంధించి కేంద్ర బలగాలతో సమీక్ష జరిపారు. జవాన్ విడుదలకు మావోయిస్టులు సంకేతాలివ్వడంతో అధికారులతో కలిసి వ్యూహ రచన చేస్తున్నారు. మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్‌పీఎఫ్‌ జవాను రాకేశ్వర్‌సింగ్ విడుదలపై సప్సెన్స్ కొనసాగుతోంది. మావోయిస్టులతో చర్చల్లో ప్రతిష్ఠంభన కనిపిస్తోంది. ఆరురోజులుగా రాకేశ్వర్‌ మావోయిస్టుల చెరలోనే ఉన్నాడు.

అయితే మావోయిస్టులు చర్చలను వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకేశ్వర్‌ను బందీగా ఉంచుకునే మావోయిస్టులు షెల్టర్‌జోన్‌కు వెళుతున్నారు. హిడ్మా సహా మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులంతా షెల్టర్‌జోన్‌కు చేరుకున్నాకే చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.