Mamata Banerjee: మమత చూపు హస్తినవైపు.. మోదీతో దీదీ మీటింగ్!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. ఆమెకు హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్‌లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థం అవుతోంది.

Mamata Banerjee: మమత చూపు హస్తినవైపు.. మోదీతో దీదీ మీటింగ్!

Mamatha

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. ఆమెకు హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్‌లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇందులో భాగంగా మమత ఢిల్లీ టూర్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రేపటి నుంచి ఢిల్లీలో మమతా బెనర్జీ పర్యటించనున్నారు.

ఈ టూర్‌లో ఎల్లుండి ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు దీదీ. మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు మోదీతో మమత భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో సోనియాను కూడా కలుస్తారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా మమత వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారు.

జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైన మమత.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కూడా అయ్యారు. టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికవగా.. రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు సొంత రాష్ట్ర వ్యవహారాలకే అత్యధిక సమయం కేటాయించిన మమత.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు.

మమతా బెనర్జీ ఏడు సార్లు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. వరుసగా మూడు సార్లు బెంగాల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటులోనూ వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ఒక రాష్ట్ర సీఎం మాత్రమే కాదు ఈ దేశ బడుగు వర్గ ప్రజల ఆశాజ్యోతి ఆ పార్టీ ఎంపీలు కూడా ప్రకటించడంతో హస్తినలోనే రాజకీయాలకు మమతా బెనర్జీ సిద్ధం అవుతున్నట్లు అర్థం అవుతుంది.