Om Birla: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ప్రయత్నాలు?

వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

Om Birla: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ప్రయత్నాలు?

Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి.

Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ వైఖరిపై మండిపడుతున్నాయి. అలాగే అనేక అంశాల్లో స్పీకర్ ఓం బిర్లా సభలో పక్షపాతంతో వ్యవహరిస్తుండటంపై కూడా ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత విషయంలో స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుని, దీన్ని ఆమోదించడాన్ని కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

రాహుల్ అనర్హత వేటు నిర్ణయాన్ని ఆమోదించడం, ఆయన బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించడం వంటి నిర్ణయాల్లో స్పీకర్ కార్యాలయం తొందరపడిందని ప్రతిపక్షాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే సరైన చర్య అని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఇదే జరిగితే రాజకీయంగా సంచలనంగా మారుతుంది.