Oppositions Letter : నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ

నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ రాశాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతొందని ఆరోపణలు చేశారు. నిత్యవసర సరుకులపై జీఎస్టీ విధించటoపై పార్లమెంట్ లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విపక్ష పార్టీల నేతలు అన్నారు.

Oppositions Letter : నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ

Letter

Oppositions letter : నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ రాశాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతొందని ఆరోపణలు చేశారు. నిత్యవసర సరుకులపై జీఎస్టీ విధించటoపై పార్లమెంట్ లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విపక్ష పార్టీల నేతలు అన్నారు. నిత్యవసర ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా చర్చ జరపాలన్నారు. కేంద్రం.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విపక్ష నేతలు విమర్శించారు.

సోమవారం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం జ‌రిగింది. ద్రౌప‌ది ముర్ము 15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముర్ము జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అత్యున్నత ప‌ద‌వికి ఎన్నిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉత్స‌వాల వేళ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌ కావ‌డం సంతోషంగా ఉందన్నారు.

President Draupadi Murmu: నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం : ద్రౌపది ముర్ము

నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయంగా అభివర్ణించారు. ‘మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే’ అంటూ రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆమె గుర్తు చేసుకున్నారు. తమ గ్రామంలో బాలికలు స్కూల్ కు వెళ్లటం ఎంతో పెద్ద విషయం అని తెలిపారు. దేశ ప్ర‌జ‌ల విశ్వాసం నిల‌బెట్టుకునేలా పనిచేస్తాన‌ని చెప్పారు.

దేశంలో మ‌రింత వేగంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉందన్నారు. పేద‌లు కూడా త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చని త‌న‌తో రుజువైంద‌ని పేర్కొన్నారు. మీ న‌మ్మ‌కం, మ‌ద్ద‌తు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించేందుకు త‌న‌కు శ‌క్తినిస్తుంద‌న్నారు. భార‌త్‌ స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత పుట్టిన తొలి రాష్ట్ర‌ప‌తిని తానేనని అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లు అభివృద్ధిలో వేగం పెంచాల‌న్నారు.