Yashwant Sinha : నేడే యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌

పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఆ తర్వాత 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్ అధికారికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అందజేయనున్నారు.

Yashwant Sinha : నేడే యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌

Yashwant

Yashwant Sinha : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్ంత్‌ సిన్హా ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేయనున్నారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ అనెక్స్‌లో విపక్షనేతలంతా భేటీ కానున్నారు. నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత విపక్షాల నేతలంతా యశ్వంత్‌ సిన్హాతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు. 12 గంటలకు విపక్ష నేతలు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయానికి చేరుకోనున్నారు.

పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఆ తర్వాత 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్ అధికారికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు యశ్వంత్‌ సిన్హాతో కలిసి విపక్షనేతలంతా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు 

యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ కూడా మద్దతు తెలిపింది. నామినేషన్‌ కార్యక్రమంలోనూ టీఆర్‌ఎస్‌ పాల్గొననుంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. .ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్‌, వెంకటేశ్‌ నేత, ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ తరపున పాల్గొననున్నారు. ఢిల్లీ టీమ్‌ను కేసీఆర్ కాకుండా..కేటీఆర్ లీడ్ చేయడం విశేషం.