New parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాను .. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది : బీఎస్పీ అధినేత్రి మాయావతి

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయ రచ్చగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.కాంగ్రెస్ తో సహా దేశ వ్యాప్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించటాన్ని వ్యతిరేకిస్తు బహిష్కరించాయి. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాను అంటూ తెలిపారు.

New parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాను .. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది : బీఎస్పీ అధినేత్రి మాయావతి

New parliament mayawati

New parliament building Inauguration : పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని 19 పార్టీలు బహిష్కరించాయి. కొత్త భవనాన్ని ప్రారంభించే అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అవమానపరుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భవనాన్ని ప్రధాని ప్రారంభించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 19 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించాయి..దీంతో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయ రచ్చగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

New Parliament : కొత్త పార్లమెంట్ భవనం రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్
కాంగ్రెస్ తో సహా దేశ వ్యాప్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించటాన్ని వ్యతిరేకిస్తు బహిష్కరించాయి. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాను అంటూ తెలిపారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమైనా రాజకీయాలకు అతీతంగా దేశ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో బీఎస్పీ వారికి ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని..పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాను అని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంటును ప్రారంభించనందుకు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరణ చేయడం అన్యాయమన్నారు.ప్రభుత్వం పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది కాబట్టి దానిని ప్రారంభించే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు.నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని గిరిజన మహిళల గౌరవంతో ముడిపెట్టడం అన్యాయమన్నారు.ద్రౌపది ముర్మును ఏకగ్రీవంగా ఎన్నుకునే బదులు ఆమెపై అభ్యర్థిని నిలబెట్టేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచించి ఉండాల్సింది అంటూ గుర్తు చేశారు.

New Parliament Building : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 ప్రతిపక్ష పార్టీలు..

కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందిందని..అందుకు నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అని తెలిపారు మాయావతి. బీఎస్పీ పార్టీ సమావేశాలకు సంబంధించి ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా నేను పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేనని తెలిపారు.