India Unlock 4.0: కొద్ది వారాల్లోనే భారత్‌లో సాధారణ పరిస్థితులొస్తాయా?

  • Published By: sreehari ,Published On : September 7, 2020 / 08:34 PM IST
India Unlock 4.0: కొద్ది వారాల్లోనే భారత్‌లో సాధారణ పరిస్థితులొస్తాయా?

Unlock 4.0 in India : కరోనా నుంచి దేశం పూర్తిగా కోలుకోలేదు. కానీ.. కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందుల నుంచి మాత్రం భారత్ బయటకొస్తోంది. అన్‌లాక్‌ 4.0లో భాగంగా.. దేశవ్యాప్తంగా మెట్రో రైల్స్ పట్టాలెక్కాయ్. రైల్వే సర్వీసులు కూడా పెరిగాయ్. ఏపీలో స్కూల్స్ కూడా తెరుచుకోబోతున్నాయ్. ఓపెన్ ఎయిర్ థియేటర్లకు కూడా పర్మిషన్ వచ్చేసింది. ఇంకా తెరచుకోవాల్సినవి కొన్నే ఉన్నాయ్. దేశంలో కరోనా ఎంటర్ కాకముందు ఎలాంటి పరిస్థితులుండేవో.. నెమ్మదిగా అలాంటి సిచ్యువేషన్స్ మళ్లీ కనిపిస్తున్నాయ్.



కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. దేశంలో మెట్రో రైల్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది కేంద్రం. అలా.. 5 నెలల తర్వాత.. దేశంలోని అన్ని మెట్రో రైల్స్ పట్టాలెక్కాయ్. మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి.. భారత్‌లోని ప్రధాన నగరాల్లోని మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయ్. ఐతే.. అన్ లాక్ 4.0లో భాగంగా ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్, లక్నో, బెంగళూరు, చెన్నై నగరాల్లో మెట్రో సర్వీసులు స్టార్ట్ అయ్యాయి.

పట్టాలెక్కిన మెట్రో :
ఇక.. హైదరాబాద్‌లో కూడా మెట్రో రైల్ పట్టాలెక్కేసింది. 3 దశల్లో మెట్రో సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మాస్క్ లేకపోయినా.. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా.. మెట్రోలోకి అనుమతించడం లేదు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు నడవనున్నాయి. అలాగే.. కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉన్న మెట్రో స్టేషన్లలో రైలు ఆగదు.



కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మెట్రో స్టేషన్లు, రైళ్లలో సోషల్ డిస్టెన్సింగ్‌కు సంబంధించి మార్కింగ్ ఏర్పాటు చేశారు. సీటు, సీటుకు మధ్యలో మార్కింగ్ ఉండనుంది. భౌతికదూరం విషయంలో.. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండేలా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న వారికే.. మెట్రోలోకి ఎంట్రీ కల్పిస్తున్నారు. మాస్క్ ఉంటేనే.. మెట్రో స్టేషన్‌లోకి అనుమతి కల్పిస్తున్నారు. ప్యాసెంజర్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. బుకింగ్ కౌంటర్ల దగ్గర.. టికెట్లు ఇవ్వడం లేదు. స్మార్ట్ కార్డు ఉన్నవారినే.. లోపలికి అనుమతిస్తున్నారు.

ఢిల్లీలో.. ఎల్లో లైన్‌లో మెట్రో స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. స‌మ‌య్‌పుర్ బ‌ద్లీ నుంచి హుడా సిటీ వ‌ర‌కు ఉద‌యం 7 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 8 వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు న‌డుస్తాయి. కేవ‌లం స్మార్ట్ కార్డు ద్వారానే ఎంట్రీ ఉంటుంది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్ కూడా.. ఆక్వా లైన్‌లో స‌ర్వీసుల‌ను ప్రారంభించింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని.. లక్నోలోనూ మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. బెంగళూరులో.. పర్పుల్ లైన్‌లో మెట్రో పరుగులు తీస్తోంది. ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు ప్రతి ఐదు నిమిషాలకొక సర్వీస్ ఉంటుందని అధికారులు చెప్పారు.



మెట్రో సర్వీసులు ప్రారంభమవడంతో.. అన్ని మెట్రోలు ప్రయాణికులకు వెల్ కమ్ చెప్పాయ్. సోషల్ మీడియాలో.. పోస్టులు పెట్టాయి. బాధ్యతాయుతంగా జర్నీ చేయాలని.. అవసరమైతేనే మెట్రోలో ప్రయాణం చేయాలని కోరాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే రైలు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. వాటికి అదనంగా మరికొన్ని సర్వీసులు కూడా స్టార్ట్ చేయబోతోంది రైల్వే శాఖ. ఇప్పటికే సరకు రవాణా వాహనాలు, బస్సులు కూడా మొదలైపోయాయ్. అంతరాష్ట్ర సర్వీసులు కూడా నడుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే.. హైదరాబాద్‌లో సిటీ బస్ సర్వీసులు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ నెల 21 నుంచే స్కూల్స్ కూడా :
ఏపీలో.. ఈ నెల 21 నుంచి స్కూల్స్ కూడా ప్రారంభంకాబోతున్నాయ్. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ లాక్-4 మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ నెల 21 నుంచి.. 9,10, ఇంటర్ విద్యార్థులు.. పాఠశాలలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే.. ఇందుకు తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది.



అదే రోజు నుంచి.. పీజీ, పీహెచ్‌డీ స్టూడెంట్స్ కూడా కాలేజీలకు వెళ్లొచ్చని తెలిపింది. స్కిల్ సెంటర్లు తెరచుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది ఏపీ. వంద మందికి మించకుండా.. సామాజిక, విద్య, క్రీడలు, మత, రాజకీయ పరమైన సమావేశాలు నిర్వహించాలను సూచించింది ఏపీ ప్రభుత్వం. 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు కూడా అనుమతి ఇచ్చింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. విడతల వారీగా.. ఒక్కొక్కటీ తెరచుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్‌మెంట్ పార్కులకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. త్వరలోనే.. అవి కూడా తెరచుకోనున్నాయి. అప్పుడు.. పూర్తిస్థాయిలో దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు.