Farmers Protest : ప్రభుత్వ ప్రతిపాదనపై ఎటూ తేలకుండానే ముగిసిన రైతు సంఘాల భేటీ

కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెట‌ర్ పై ఎటూ తేల్చుకోకుండానే

Farmers Protest : ప్రభుత్వ ప్రతిపాదనపై ఎటూ తేలకుండానే ముగిసిన రైతు సంఘాల భేటీ

Rakesh

Farmers Protest : కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెట‌ర్ పై ఎటూ తేల్చుకోకుండానే రైతు సంఘాల భేటీ ముగిసింది. కేంద్రం ప్రతిపాదనపై చ‌ర్చించ‌ేందుకు ఇవాళ మధ్యాహ్నాం సింఘూ స‌రిహ‌ద్దులో ”సంయుక్త కిసాన్ మోర్చా (SKM)స‌మావేశ‌మైంది. అయితే ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోకుండానే ఈ స‌మావేశం ముగిసింది. బుధ‌వారం మ‌రోసారి స‌మావేశ‌మై, కేంద్రం ప్రతిపాదనపై చ‌ర్చిస్తామ‌ని SKM పేర్కొంది.

ఇవాళ SKM కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన భారతీయ కిసాన్ యూనియన్ నేత  గుర్నామ్ సింగ్..”రైతులు మరియు ప్రభుత్వ అధికారులు ఇద్దరూ MSP మరియు ఇతర పెండింగ్ డిమాండ్లపై కమిటీలో భాగం కావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఎంఎస్‌పి కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి,దీనిపై తదుపరి చర్చలు జరుగుతాయి. అలాగే ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌పై తాము కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌ను కూడా సూచించాం. ఆందోళన సమయంలో మరణించిన రైతులకు నష్టపరిహారం- పంజాబ్ ప్రభుత్వ మోడల్ పై ఆధారపడి ఉండాలని రైతు సంఘం SKM ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారం మరియు ఉద్యోగం భారత ప్రభుత్వం కూడా అమలు చేయాలి. SKM మళ్లీ బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది”అని అన్నారు.

సంయుక్త కిసాన్ మోర్చాకు సంబంధించిన మరో నేత మాట్లాడుతూ…” ఉద్య‌మాన్ని పూర్తిగా నిలిపేస్తేనే మాపై ఉన్న కేసులు ఎత్తేస్తామ‌ని ప్ర‌భుత్వం అంటోంది. దీనిపై మాకు అభ్యంత‌రాలున్నాయి.. కేసుల ఎత్తివేత అనేది అతి తొంద‌ర‌గా ప్రారంభం కావాల‌ి. అలాగే ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌పై మేము కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌ను కూడా సూచించాం”అని అన్నారు.

ఈ సందర్భంగా SKM ప్రతినిధి రాకేష్ టికాయిత్ మాట్లాడుతూ.. రైతుల డిమాండ్‌లకు అంగీకరిస్తున్నామని, నిరసనను విరమించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రతిపాదన స్పష్టంగా లేదు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి సమావేశమవుతాం. మా ఉద్యమం ఎక్కడికీ వెళ్లదు, ఇక్కడే ఉంటుంది. అన్నీ పరిష్కారమయ్యే వరకు ఎవరూ ఇంటికి వెళ్లరు”అని అన్నారు.

ALSO READ Paytm Special Offer : పేటీఎం స్పెషల్ ఆఫర్.. విమాన టికెట్ల బుకింగ్‌పై భారీ తగ్గింపు!