అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

  • Published By: venkaiahnaidu ,Published On : February 15, 2019 / 06:08 AM IST
అంతుచూడండి  :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తామని అన్నారు. పుల్వామా ఉగ్ర‌దాడితో దేశ ప్ర‌జ‌ల ర‌క్తం మ‌రిగిపోతుంద‌ని అన్నారు.

ఉగ్రదాడిని ఖండించి, భారతదేశానికి సపోర్ట్ అందించిన దేశాలకు ధన్యవాదలు చెబుతున్నానని మోడీ అన్నారు. ఈ ఉగ్రదాడికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తామని అన్నారు.ప్రపంచంలో ఒంటరైన పాక్ కనుక తన కుట్రలు, కుతంత్రాల ద్వారా భారత్ ను అస్థిరపర్చాలని చూస్తే అది పెద్ద పొరపాటు చేస్తున్నట్లే అని అన్నారు.అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

పాకిస్తాన్ కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్(MNF)స్టేటస్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని అధ్యక్షతన సమావేశన సీఎస్ఎస్ హైలెవల్ మీటింగ్ తర్వాత  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.