Asaduddin Owaisi : మన జవాన్లు మరణిస్తుంటే..పాక్ తో టీ 20 ఆడతారా?చైనా అంటే మోదీకి భయం

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ కార్యక్రమంలో పాల్గొన్న

10TV Telugu News

Asaduddin Owaisi ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ..ప్రధాని మోదీ రెండు విషయాల గురించి ఎపుడు మాట్లాడరన్నారు. పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల గురించి మరియు లడఖ్ లోని భారత్ భూభాగంలో చైనా తిష్ట వేయటం గురించి మోదీ ఎప్పుడూ మాట్లాడరన్నారు.

పాకిస్తాన్ పుల్వామా దాడికి పాల్పడినప్పుడు.. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఎదురుదాడి చేస్తానని మోదీ చెప్పారు. మేము కూడా మోదీని అలా చేయమని అడిగాము. ఇప్పుడు, అరుణాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లో కూడా చైనా మన భూభాగంలో కూర్చుని ఉంది..ప్రధాని మోదీ ఏమీ మాట్లాడల్లేదు అని ఓవైసీ అన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే ప్రధాని మోదీకి భయం అని ఓవైసీ ఆరోపించారు.

ఇక,ఈ సందర్భంగా ఇండో-పాక్ మ్యాచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ రద్దు చేయాలని ఓవైసీ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన వేర్వేరు ఆపరేషన్స్ లో మన సైనికులు 9 మంది మరణించారరని ఓవైసీ గుర్తుచేశారు.  సరిహద్దుల్లో పాకిస్తాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే మన సైనికులు చనిపోతుంటే..మీరు టీ 20 ఆడతారా?జమ్మూ కశ్మీర్ ప్రజలతో రోజూ పాకిస్తాన్ టీ-20 మ్యాచ్ ఆడుతుందని అని ఓవైసీ ఫైర్ అయ్యారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల కాలంలో సామాన్య పౌరుల హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఓవైసీ ఆరోపించారు. కశ్మీర్ లో.. బీహార్ పేద కార్మికులు చంపబడుతున్నారు. కశ్మీరేతర కూలీలే లక్ష్యంగా దాడులు జరుతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమి చేస్తున్నారు? ఇది కేంద్రం వైఫల్యమే అని ఓవైసీ అన్నారు.

అంతేకాకుండా ఓవైసీ మాట్లాడుతూ..మగాళ్లకో న్యాయం, ఆడవాళ్లకి మరో న్యాయమా అని ఓవైసీ ప్రశ్నించారు. ఒక ముస్లిం అబ్బాయి ఎవరితో అయిన తిరోగొచ్చు.. కానీ ఒక ముస్లిం అమ్మాయి తిరోగొద్దు. దేశం, ప్రపంచ, టెక్నాలజీ మారింది. ఇపుడు మనం ఉన్నది 1969 కాదు2021. కాలానికి తగినట్టు మనం మారక తప్పదన్నారు. బుర్కా వేసుకున్న అమ్మాయి.. ముస్లిం అబ్బాయితో తిరిగితే ఏ సమస్యలేదు.. కానీ అదే ముస్లిం అమ్మాయి వేరే వాళ్లతో తిరిగితే.. నడి రోడ్డుపై దాడి చేస్తారా అని ఓవైసీ ప్రశ్నించారు.

ALSO READ అమెరికాలో ఇండియ‌న్ రెస్టారెంట్‌ ధ్వంసంపై ఎఫ్‌బీఐ విచార‌ణ