Pariksha Pe Charcha: విమర్శల గురించి అడగ్గా.. అది సబ్జెక్టు కాదని చెప్పిన ప్రధాని మోదీ
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్‌కట్లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయితే, అదే విద్యార్థులు తమ సమయాన్ని, సృజనాత్మకతను మంచి మార్గంలో వాడితే ఉన్న శిఖరాలను అధిగమిస్తారని చెప్పారు

Pariksha Pe Charcha: మరో నెల రోజుల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం విద్యార్థులతో ‘పరీక్ష పే చర్చ’ నిర్వహించారు. విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రధానిని ఓ విద్యార్థి రాజకీయ విమర్శల గురించి ప్రశ్నించారు. అయితే ఇది ఇక్కడ చర్చించాల్సిన సబ్జెక్ట్ కాదని మోదీ సూచించారు.
‘‘ప్రశ్న ఇక్కడ మన సిలబస్ ప్రకారమే అయినా.. విమర్శలు అనేవి ప్రజాస్వామ్యాన్ని మరింత శుద్ధి చేస్తాయి. నాపై వచ్చే విమర్శల్ని నన్ను మరింత శుద్ధి చేస్తాయని నేను అనుకుంటాను’’ అని మోదీ అన్నారు. విమర్శకి, అడ్డంకికీ మధ్య చిన్న గీత ఉంటుందని, పిల్లలను సానుకూల దృక్పథం వైపునకు నడిపించేలా తల్లిదండ్రులు విమర్శించాలని చెప్పారు.
స్క్రీన్ పై భారత ప్రజలు ప్రతిరోజు సగటున 6 గంటలు గడుపుతారని అన్నారు. ఇది ఆందోళనకర విషయమేనని చెప్పారు. మనం గ్యాడ్జెట్లకు ఎందుకు బానిసలం కావాలని ఆయన ప్రశ్నించారు. ఆ అలవాటును తగ్గించుకోవాలని చెప్పారు. సమయ పాలన గురించి తెలుసుకోవాలంటే అమ్మను చూడాలని ఆయన అన్నారు. అలాగే, విసయాన్ని, ఓటమిని విద్యార్థుల సమానంగా తీసుకోవాలని చెప్పారు.
Donald Trump: నేనైతే ఒక్క రోజులోనే తేలిపోయేది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్‌కట్లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయితే, అదే విద్యార్థులు తమ సమయాన్ని, సృజనాత్మకతను మంచి మార్గంలో వాడితే ఉన్న శిఖరాలను అధిగమిస్తారని చెప్పారు. పరీక్షలపై శ్రద్ధ పెట్టే విద్యార్థుల శ్రమ వృథా కాదని చెప్పారు. పరీక్షా పే చర్చ అనేది తనకు కూడా ఓ పరీక్ష వంటిదేనని అన్నారు.