Children Lost Parent : కరోనా కారణంగా అనాథలుగా మారిన లక్షమందికి పైగా పిల్లలు, లాన్సట్ స్టడీ

కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు.

Children Lost Parent : కరోనా కారణంగా అనాథలుగా మారిన లక్షమందికి పైగా పిల్లలు, లాన్సట్ స్టడీ

Children Lost Parent

Children Lost Parent : కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు. ఈ మహమ్మారి కారణంగా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడిని కోల్పోయారు. లాన్సట్ స్టడీ ప్రకారం దేశంలో 1.1లక్షల పిల్లలు తమ పేరెంట్ ను కోల్పోయారు.

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 15లక్షల మంది పిల్లలు పేరెంట్ లేదా గార్డియన్ ను కోల్పోయినట్టు లాన్సట్ స్టడీ అంచనా వేసింది. మహమ్మారి మన దేశంలో ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు ఒక లక్ష 86వేల 972మంది పిల్లలు కనీసం ఒక పేరెంట్, బంధువు లేదా గార్డియన్ ను కోల్పోయారు. ఒక లక్ష 16వేల 236 మంది పిల్లలు వారి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయారు. మిగిలిన వారు తమ గ్రాండ్ పేరెంట్ లేదా బంధువుల్లో పెద్దవారిని కోల్పోయారు. మార్చి 2021తో పోలిస్తే ఏప్రిల్ 2021లో సెకండ్ వేవ్ విజృంభణ సయమంలో అనేకమంది పిల్లలు అనాథలుగా మారారు. వారి శాతం 8.5పెరిగింది. మార్చి 2021లో 5వేల 91మంది పిల్లలు అనాథలయ్యారు. నెల రోజుల తర్వాత ఆ సంఖ్య 43వేల 139కి పెరిగింది.

అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, లండన్ ఇంపీరియల్ కాలేజీ, డబ్ల్యూహెచ్ వో, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు స్టడీలో పాల్గొన్నారు. 14 నెలల మహమ్మారి కాలంలో సుమారు 10లక్షల మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరిని కరోనా కారణంగా కోల్పోయినట్టు అంచనా వేశారు. మరో 5లక్షల మంది పిల్లలు తమ గ్రాండ్ పేరెంట్ లేదా కేర్ టేకర్ ను కోల్పోయారు. పిల్లలకు మరో ముప్పు పొంచి ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, వారిపై లైంగిక దాడులు జరగొచ్చని, చిన్న వయసులోనే గర్భం వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు కరోనా మరణాల్లో ఒక చిన్నారి పేరెంట్ ను కోల్పోతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారుల సంఖ్య ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.