తొలి రోజు 1లక్షా 91వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్

తొలి రోజు 1లక్షా 91వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్

vaccine shots దేశవ్యాప్తంగా ఇవాళ(జనవరి-16,2020)ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా.. తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రక్రియలో 16,755 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది.

మొదటి వ్యాక్సిన్​ డోసు తీసుకున్న తర్వాత ఒక్కరు కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 3,351 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్​ ప్రక్రియ జరిపినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాగా,వ్యాక్సిన్​ తీసుకోవడంపై వస్తోన్న వదంతులను నమ్మరాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ప్రముఖ డాక్టర్లు సైతం టీకా డోసు తీసుకున్న విషయాన్ని తెలిపారు.

మరోవైపు, వ్యాక్సిన్ డోసు రాజకీయ నాయకులు ఎందుకు తీసుకోవడం లేదంటూ వస్తోన్న విమర్శలపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్…​వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ వంతు వచ్చేదాకా వేచి చూడాలని అన్నారు. 50 ఏళ్లు పైబడినవారికి టీకా ఇవ్వడం ప్రారంభించాక అప్పుడు తానూ వ్యాక్సిన్ తీసుకుంటానని ఆరోగ్య మంత్రి అన్నారు.