ప్రపంచంలోని శాస్త్రవేత్తల్లో 2శాతం తమిళులే

ప్రపంచంలోని శాస్త్రవేత్తల్లో 2శాతం తమిళులే

Scientists: ప్రపంచంలోని సైంటిస్టులలో టాప్ 2శాతం మంది తమిళనాడు నుంచే ఉన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన డేటాబేస్ ప్రకారం ఇది కన్ఫామ్ అయింది. స్పెషలైజేషన్ ను బట్టి సైంటిస్టులను ర్యాంకుల వారీగా విడగొట్టారు. ఈ లిస్టులో తొలి రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ చేసిన దాని నుంచి లేటెస్ట్ రీసెర్చ్ ఆర్టికల్ వరకూ సైంటిస్టుల పేర్లు నమోదుచేశారు.

ఈ లిస్టులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కు చెందిన 36మంది ప్రొఫెసర్లు టాప్ లో ఉన్నారు. అకౌస్టిక్స్, ఏరోస్పేస్, ఏరోనాటిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ ఆటోమొబైల్, మెటేరియల్స్, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ట్రాన్స్‌మిషన్, మెడికల్ అండ్ బయోమాలిక్యులర్ కెమిస్ట్రీ, నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఆప్టోఎలక్ట్రానిక్స్ అండ్ ఫొటోనిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగాలతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచ్చి నుంచి కూడా ఏడుగురు లిస్టులో ఉన్నారు.



రాష్ట్రం నడిపిస్తున్న యూనివర్సిటీల్లో అన్నామలై యూనివర్సిటీ నుంచి 9, భారతియార్ యూనివర్సిటీ నుంచి 8 మంది ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, మధురై కామరాజ్ యూనివర్సిటీ, మనోన్మనియం సుందరనార్ యూనివర్సిటీ, అలగప్ప యూనివర్సిటీ, భారతిదసన్ యూనివర్సిటీల నుంచి ఇద్దరు పెరియార్ యూనివర్సిటీ నుంచి ఒకరు, అన్నా యూనివర్సిటీ నుంచి ఒకరు, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఒకరు ఈ లిస్టులో ఉన్నారు.

గవర్నమెంట్ కాలేజి ప్రొఫెసర్:
అన్నా యూనివర్సిటీ సంబంధిత గవర్నమెంట్ కాలేజి కూడా లిస్టులో ఉంది. డా.అలగప్ప చెట్టియార్ గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ మెంబర్ గా ఉన్నారు. ఈ ఫ్యాకల్టీ పేపర్ చివరిగా 2012లో పబ్లిష్ అయింది. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎస్సారెమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వేలూర్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ, చెన్నై క్యాంపస్ ల నుంచి ఒక్కొక్క దాని నుంచి ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. ఒకరేమో శ్రీరామ చంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పోరూర్, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ల నుంచి నలుగురు, అమృతా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఒకరు.
https://10tv.in/bihar-assembly-elections-2020-big-mistake-in-voter-list-second-phase-election/
ఆఫ్తల్మిక్ హాస్పిటల్స్ నుంచి కూడా ఈ లిస్టులో ఉన్నారు. శంకర్ నేత్రాలయ, అరవింద్ ఐ కేర్ సిస్టమ్స్ నుంచి ఒకొక్కరు, క్రిస్టియన్ మెడికల్ కాలేజి, వేలూరు నుంచి ఎనిమిది మంది ఉండగా, లయోలా కాలేజి నుంచి ఇన్ ఆర్గనిక్, న్యూ క్లియర్ కెమిస్ట్రీ విభాగంలె ఒక ప్రొఫెసర్ ఉన్నారు.

పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి పలు సెక్షన్లలో ఐదుగురు సైంటిస్టులు స్థానం దక్కించుకున్నారు.