Namaaz on Road: వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డుపై నమాజ్: 150 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ..నడిరోడ్డుపై నమాజ్ నిర్వహించిన 150 మంది పై ఆగ్రా నగర పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు.

Namaaz on Road: వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డుపై నమాజ్: 150 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Namaz

Namaaz on Road: వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ..నడిరోడ్డుపై నమాజ్ నిర్వహించిన 150 మంది పై ఆగ్రా నగర పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు. రోడ్డుపై ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా ఎటువంటి మతపరమైన కార్యక్రమాలను అనుమతించకూడదని..అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కళాశాల రోడ్డులో ఉన్న ఇమ్లి వలి మసీదు వద్ద రంజాన్ సందర్భంగా ఐదు రోజుల పాటు రోడ్డుపై నమాజ్ నిర్వహించుకునేందుకు నగర పాలక సంస్థ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే రోడ్డు మొత్తాన్ని పూర్తిగా నిర్బంధించి వారు నమాజ్ నిర్వహించారు. దీంతో స్థానికులు కొందరు అసహనం వ్యక్తం చేయగా..ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డు పై నమాజ్ ఏంటంటూ హిందూ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Also read:Gems Land Capture: బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు

దీంతో పోలీసులు కలగజేసుకుని..ఐదు రోజుల అనుమతిని మూడు రోజులకు కుదించారు. అదే సమయంలో నమాజ్ సమయానికి మించి ముస్లింలు రోడ్డును నిర్బందించడంపై మసీదు చుట్టుప్రక్కల దుకాణదారులు, ఇతర వ్యాపారస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవగా..రెండు రోజుల్లోనే నమాజ్ అనుమతిని రద్దు చేశారు పోలీసులు. నమాజ్ కోసం తీసుకున్న అనుమతిని మసీదు నిర్వాహకులు ఉల్లంఘించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతోపాటు స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అనుమతి ఉపసంహరించుకుని 150 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Also read:Crime news : పూజకోసం గుడికొచ్చిన భక్తురాలిని హత్యచేసిన పూజారి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

కొత్త అనుమతుల ప్రకారం ఏప్రిల్ 4 వరకే నమాజ్ కు అనుమతులు ఇచ్చామని.. అయితే ఏప్రిల్ 4 తరువాత కూడా మసీదు నిర్వాహకుడు ఇర్ఫాన్ సలీమ్ నమాజ్ ఏర్పాటు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే..నమాజ్ అనుమతిని పోలీసులు రద్దు చేయడంపై మసీదు నిర్వాహకుడు ఇర్ఫాన్ సలీమ్ మాట్లాడుతూ..గత కోనేళ్ళుగా రంజాన్ మాసంలో స్థానిక వ్యాపారుల సహకారంతో, అధికారుల అనుమతితో మసీదు ఎదురుగా రోడ్డుపై నమాజ్ నిర్వహించుకున్నామని..అయితే ఈ ఏడాది కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తమ అనుమతిని రద్దు చేయించారని ఆరోపించారు. అయితే గతంలో ఇదే ప్రాంతంలో భజన ఏర్పాటు చేసిన కొందరు వ్యక్తులపైనా వ్యతిరేకత వ్యక్తం అవగా..పోలీసులు ఆనాటి నుంచి అనుమతిలేని బహిరంగ ప్రార్థనలను నిషేదించారు.

Also read:Minor Mother: పెళ్లికాకుండా 17 ఏళ్లకే తల్లి అయిన బాలిక, 12 ఏళ్ల బాలుడే కారణం?